[dropcap]ఆ[/dropcap]దివారం ఒకటి
రాత్రి పూట చీకటి
సోమవారం రెండు
వేసవి ఎండలు మెండు
మంగళవారం మూడు
పిచ్చుక ఇల్లు గూడు
బుధవారం నాలుగు
ఎలుక ఇల్లు కలుగు
గురువారం ఐదు
తీగకు మూలం పాదు
శుక్రవారం ఆరు
అందరి మంచిని కోరు
శనివారం ఏడు
ఎప్పుడూ నిజమే మాటాడు