[dropcap]న[/dropcap]లుపూ తెలుపూ లేదు
కులం మతం లేదు
తూర్పూ పడమర లేదు
ఉత్తరం దక్షిణం లేదు
విశ్వమానవ సౌభ్రాతృత్వం కాదు
విశ్వమానవ ‘ప్రాణభీతి’
ఒకేఒక్క ‘కుగ్రామం’ అయిపోయిన ప్రపంచం
ఒక్కొక్క మనిషిగా
విడిపోయి విస్తరించిపోయింది.
అన్ని అభిజాత్యాలు, అహంకారాలు
అర్ధకణ జీవి ముందు
మోకరిల్లిన క్షణాలు
మనిషికి చెరసాల
వాయుదేవుడికి స్యాతంత్రం!
మనిషిని అష్టదిగ్భందనం చేస్తే గాని
నేలతల్లికి ఊపిరందలేదు గదా!
ఎంతటి వైపరీత్యం.