[dropcap]అ[/dropcap]టు చూడు
చెడు కర్మల శాస్త్రాలు
ఇటు చూడు
మూఢ నమ్మకపు నీడలు
అటు వైపో
వెర్రితనపు ఆవేశాలు
ఇటు వైపో
అహంకారపు వేషాలు
మూసెయ్ ఒక్కో తలుపు
మూసెయ్ మూసెయ్
అటు
నవ్వు నటిస్తున్న వాళ్ళు
ఇటు
నటనలతో కవ్విస్తున్న వాళ్ళు
నిన్ను మెట్టుగా చేసుకు
నడిచెళ్ళే వాళ్ళింకోవైపు
మూసెయ్ ఒక్కో తలుపు
మూసెయ్ మూసెయ్
ఇటు నువు
చాలా అవసరమని మోసే నోళ్ళు
అటు వాడుకు
పక్కకు తోసే జాదూగాళ్ళు
ఇటు చూస్తే
హఠాత్తుగా ఒలికించే ప్రేమలు
అటు చూస్తే
రెండు నాల్కల నాలుగు ముఖాల హైనాలు
మూసెయ్ ఒక్కో తలుపు
మూసెయ్ మూసెయ్
మూసెయ్ మూసెయ్ తలుపులు
నీ నవ్వుకులికి పడేవాళ్ళపై
పక్కకు తిరిగేడ్చే వీళ్ళపై
నీ అతినమ్మకపు చాదస్తాల పై
నీ అతి కారుణ్యపు హృదయం పై కూడా
మూసెయ్ మూసెయ్ తలుపులు
ఒక్కొక్కటిగా
త్వరగా అతి త్వరగా