[dropcap]ఇ[/dropcap]ప్పుడు ఒకరినొకరు
అంటకూడని ఆరోగ్య ఉత్తర్వులు
అగ్ర దేశాల పరస్పర ఆరోపణల బాణాలతో
గాయపడుతున్న సామాన్య దేశాల
హాహాకారాలు వినే కాలమా ఇది!
ఎవరికి వారు తలుపులు బిడాయించుకుని
తనగురించి తనవాళ్ళ గురించి
తపన పడుతున్నప్పుడు
అసుపత్రుల్లో అహోరాత్రాలు
కంటికి రెప్పలే లేనట్లు సర్వం మర్చిపోయి
మనకోసం ప్రాణాల్ని పణం పెడుతున్న
ధన్వంతరుల కోసం ప్రార్థిస్తావా!
ఎక్కడయినా ఓ డాక్టర్
కరోనాసోకి కన్నుమూసిన వార్త వింటే
మనసునిండా నివాళి తడి నిస్తావా!
నియంత్రణ కోసం లాఠీ ఝళిపించే
పోలీస్ అన్నకి సెల్యూట్ చేయగలరా
పారిశుధ్య పని నర్సింగ్
ఎందరో పారామెడికల్ మిత్రులు
ఇరవై నాలుగు గంటలు శ్రమిస్తుంటే
పాలనా యంత్రాంగం పలువిధాల
సౌకర్యాలిస్తూ సతమతమవుతుంటే
ఇంట్లో కూర్చోమంటే ఇంతబాధ నీకెందుకు?
గొప్ప గొప్ప దేశాలన్నీ
గప్పాల కుప్పలవటం చూస్తునావుకదా!
అడుగు బయటికేసే ఆలోచన వస్తే
కాళ్ళకు కరోనా సంకెళ్ళేసుకో!
ఇంక ఆలోచించే సమయంలేదు
ఇది భూగోళానికకే తాళం పడిన వేళ
ఇది మరణ మృదంగాన్ని మట్టుపెట్టటానికి
మూకుమ్మడిగా చేసే ఒంటరిపోరాట కీల