దీపాల పండుగ రాత్రి

0
5

[box type=’note’ fontsize=’16’] గన్సు ప్రావిన్స్ లోని షాదన్ కంట్రీ పీపుల్స్ ఆసుపత్రిలో పనిచేసే వీ షుయన్ అనే నర్సు రాసిన కవిత ఇది. విరుచుకుపడిన కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా ఊహాన్‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రుల్లో పని చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. కరోనాను నివారించడానికి, కట్టడి చేయడానికి తన సహచరులతో కలిసి పోరాడుతోంది. [/box]

***

[dropcap]ఊ[/dropcap]హాన్ జిన్‌లియ హోటెల్ ఎనిమిదో అంతస్తు కిటికీలోంచి బయటకు చూస్తే
దీపాలు అప్పటికే నగరాన్ని వెలిగిస్తున్నాయి
ఆకాశహార్మ్యపు ఛాయల శోభ
రాత్రి అసలు రంగులను విశదీకరిస్తోంది
నిశ్శబ్దం. తీవ్ర దుఃఖం. స్తబ్దత.
కొనసాగుతున్న లోతైన దుఃఖపు స్థితిని
నేను ఆ లాంతర్ల చాటు నుంచే తెలుసుకోగలను
ఇప్పటికీ చాలా కిటికీలు నల్లగానే ఉన్నాయి
నలుపు- లోయలాంటి.. గబ్బిలంలాంటి..
విషం దాగిన పూల కిరీటాన్ని మింగేయడంలాంటి.

ఆ చీకట్లో నేను దూరంగా చూపులు సారిస్తా
హాన్ నది, యాంగ్జీ  ఎంతదూరమో చూస్తుంటా
ఎల్లో క్రేన్ టవర్ దూరం
తాత్కాలిక ఆసుపత్రి దూరం
గన్సులోని హెక్సీ కారిడార్ దూరం
షాంఘైలోని హువాంగ్పు నది దూరం
మనందరికీ తిండి పెడుతున్న ఆ స్వర్గపు దూరం
చీకటి ఇంకా విస్తరిస్తోంది

కానీ నాకేమీ సందేహం లేదు, అంతా బాగానే ఉంటుంది
దీపాల పండుగ నాటి చంద్రోదయంలా..
అంతా బాగుంటుంది, అంతా ప్రకాశవంతంగా ఉంటుంది.

అనువాదం: దేశరాజు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here