‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. రాయప్రోలు వారి సుప్రసిద్ధ దేశభక్తి గేయం ఇలా మొదలౌతుంది. (1,5) |
4. ఈటీవి వంటల కార్యక్రమం (4) |
7. కళ్లెము (2) |
8. పిపీలకములో కోకిల మిస్సింగ్. చదరంగంలోని ఏనుగు ప్రెజెంట్. (2) |
9. ఉత్పల వారి చుట్టం ఈ ఆత్రేయుడు. (7) |
11. జాబులుజట్రలలో దాగిన జబ్బు (3) |
13. స్వయం సమృద్ధి (5) |
14. వెనుదిరిగిన మిలియన్ (5) |
15. కరోనా కట్టడికోసం మూతికి ఇది లేనిదే గడపదాటరాదు. (3) |
18. ఇది కూడా కరోనా మహమ్మారి నియంత్రణకు పాటించాల్సిన నియమం. వెనుక నుండి ముందుకు. (7) |
19. రాతిరిలో మెలిక (2) |
21. నాకు ఒక (2) |
22. ఆశకు పోతే ఇది ఊడిందట (4) |
23. రామానుజను కడుపులో పెట్టుకున్న ఓనరమ్మ. (5) |
నిలువు:
1. ఒన్ సైడెడ్ (4) |
2. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చిన తొలి సినిమా. (2) |
3. ప్రేలుడు పదార్థములతో రహస్యముగా తయారుచేసిన దేశవాళీ బాంబులు (5) |
5. రూపం మార్చిన రూపాయ (2) |
6. రత్నపురిగడ్డ(6) |
9. ఆమె నవ్వు ముత్యాలు దొర్లినట్టు ఉంది అనే వాక్యానికి అందం చేకూర్చినది. (7) |
10. రైలుకథల సంపాదకులైన వేంకటస్వామి గారు పాక్షికంగా శీర్షాసనం వేశారు. (3,4) |
11. జమున గాంచిన లోకులు (3) |
12. ___ సొక్కా ఏసినవాడా పిలగా/ చిలకముక్కు చిన్నవాడా అని పెంచల్‌దాస్ పాట.(3) |
13. అష్టవిధ నాయికలలో ఒకతె. (6) |
16. దేవకన్య ? (5) |
17. ఆమంత్రణ (4) |
20. అంతరిక్షాలలో వాహనం (2) |
21. లోకేశుని గృహనామం (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మే 12 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మే 17 తేదీన వెలువడతాయి.
పదసంచిక-50 జవాబులు:
అడ్డం:
1.కైపనాగరాజ 4.ధీరేధీరే 7.వాణి 8.మాడి 9.తిరుపతిక్షౌరము 11.మెజంటా 13.వికలాంగుడు 14.అల్లంరాజయ్య 15.దధీచి 18.విజ్ఞానసర్వస్వము 19.షమ్మీ 21.పిర 22.మురభిత్తు 23.రేడియోఅన్నయ్య
నిలువు:
1.కైవారము 2.పణి 3.జపూతిపజం 5.ధీమా 6.రేడియోఅక్కయ్య 9.తిరుమలాంబదేవి 10.ముత్యాలరాజీయము 11.మెడుద 12.టాఅచి 13.విద్యుదున్మేషము 16.ధీరసమీరే 17.శంకరయ్య 20.మ్మీర 21.పిన్న
పదసంచిక-50కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- కన్యాకుమారి బయన
- భాగవతుల కృష్ణారావు
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- సరస్వతి పొన్నాడ
- శంభర వెంకట రామ జోగారావు
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.