వారెవ్వా!-29

0
3

[dropcap]క[/dropcap]రోనా మితిమీరి పోయెను
కంప్యూటరు కాల మందున.
అగ్రరాజ్యములందు గూడా
అడ్డు, అదుపు లేకపోయెను.
మానవుని మేధస్సు కందని
మహామారరణ హోమమాయె.
అపరిశుభ్రతకు చోటు లేని
అమెరికాలో రెచ్చిపోయె.
కానరాని గాలి పురుగే
కవ్వింపుకు కాలు దువ్వెను.

***

ప్రతి ప్రాణిని తిన్న పాపము
ఊరికే పొతుంటదా?
కాలగర్భమునందు కలవదు
వీరబ్రహ్మం కాలజ్ఞానము.
మనిషి బయట తిరుగుతూంటే
మహమ్మారి సోకుతుందట.
లాక్‌డౌన్ నియమా చరణతో
తగ్గె వైరస్ వేగమెంతో.
ఇల్లు జైలుగ మారిపోయెను
ఉండలేక విసుగు బుట్టెను.

***

చైనా కుట్ర చేయవచ్చని
ట్రంపుగారు సెలవిచ్చినారు.
భారతదేశమ్ము నందు
తబ్లిక్ మర్కజ్ తమాషా.
వైద్య బృందం, పోలీస్ సేవ
త్యాగముకు జోహారులాయె.
రెక్కలను నమ్ముకున్న కూలీ
బతుకు బాటన ముళ్ళపొదలు.
సన్నకారు వ్యాపారజీవి
కేకలెవ్వరు విందురయ్య.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here