ఓ కరోనా…

0
3

[dropcap]ఓ[/dropcap] కరోనా…
మా ప్రభుత్వం గొప్పది
ఎప్పటికప్పుడు మమ్మల్ని
అప్రమత్తం చేస్తూనే ఉంది!
కే.సి.ఆర్, మోడి సార్ల లాంటి
నాయకులండగా! నిన్ను తరమడం సులభమే!

విద్యాసంస్థలు పిల్లలు లేక
బోసిపోయాయి!
ఆన్‌లైన్‌లో పాఠాలు ప్రసారం చేసి
పిల్లలకు విద్యనందిస్తున్న గవర్నమెంటు
ఇంటిపట్టునే ఉంటాం నిన్ను తరిమి కొడతాం!

ఓ రక్కసి….
కరోనా రాక్షసి…
యముడితో పోరాడాలి ప్రతి క్షణం!
ప్రపంచం అంతా పాకింది
మనిషి మనిషికి దూరం పెంచింది…
ఆర్థిక రంగాన్ని నిలువెత్తున ముంచింది!
కంటికి కునుకు లేకుండా చేసింది!

మేము ఉన్నామంటూ వచ్చారు ఎందరో
దేశమంతా సంపూర్ణంగా బంద్…
ఏం జరుగుతుందో తెలవని ప్రజలు!..?
ఇంట్లో పెళ్ళాం, పిల్లలున్న మనకోసం…
కెమెరాలు పట్టి ఎర్రటి ఎండలో
ఎన్నో క్లిష్ట పరిస్థితులున్నా, మేమున్నామంటూ
ప్రతీదీ మనకు చూపిస్తూ!
మన మంచికోరి హెచ్చరిస్తూ
నిత్యం దేశ బాగుకై ఆలోచిస్తూ
కరోనాను కట్టడి చేయుటకై శ్రమిస్తున్న… ఓ
మీడియా మిత్రులారా మీకు
వందనం… అభినందనం!

తమ ప్రాణాల్ని సైతం
లెక్కజేయని వైద్యరంగం!
తమవారికి దూరంగా
కష్టపడుతున్నారు ప్రతి నిమిషం!
మన కోసమే తపిస్తారు అనుక్షణం
ప్రాణాలను పణంగా బెట్టి
ఈ మహమ్మారి వైరస్‌తో పోరాడుతున్నారు…
ఇంటి గడప తొక్కలేక
పిల్లలను హృదయానికి హత్తుకోలేక
అల్లాడుతున్నారు ఈ సేవా మూర్తులు
వైద్యులే మా తేజోమూర్తులు!

ఇదంతా ఒక ఎత్తైతే,
సర్వస్వాన్ని విడిచిపెట్టి
ఎర్రటి ఎండలో ఆకలిని దూపలను మరిచి
రోడ్లపై తిరుగుతూ, మనల్ని రక్షిస్తూ!
బయటకు రావద్దని చెప్తూ
వస్తే రకరకాల శిక్షలను విధిస్తూ
మనల్ని కాపాడుతున్న పోలీసులకి
త్రివర్ణ కమలాల వందనాలు.

ఓ రక్కసి
కరోనా రాక్షసి
మాపై నీకెందుకంత కోపం
పూర్వం ఏమైనా చేశామా పాపం…
మనుషులను విడగొట్టావు!
జీవం… నిర్జీవం లేకుండా…
నువ్వెక్కడైనా బతుకుతూ
మా బతుకులను ఆగం జేస్తున్నావు!

ఓ బద్మాష్ కరోనా!!
మా ముందు నీ ప్రతాపం ఎంత?
దమ్ముంటే మా గడప దాటు!
ఓ కరోనా…
నీవు రాలేవు
కళ్ళాపి చల్లే మా సంస్కృతిని…
దాటి మా ఇంట్లోకి రాలేవు…
పొరపాటున వస్తే…
మా ఇంటి గడపకున్న పసుపు…
నీ పాలిట యమపాశం…
ప్రపంచానికి ఆయుర్వేదం నేర్పింది మా ఆచారం
మంచి గుండది నీ గాశారం…

పోలీసన్నలకి కునుకు లేకుండా
వైద్యులకి రికాం లేకుండా
ప్రభుత్వాలకు నిమ్మలం లేకుండా!
ఎందుకు ఇలా చేస్తున్నావు
ఓ కరోనా…
నీతో మేము యుద్ధానికి…
స్వయంగా సిద్ధం…
సమూహంగా… కాదు!

భారతదేశం దైవానికి నిలయం…
ఉన్నాయి ఎన్నో దేవాలయాలు!
రాగి, మారేడు, వేప నేరేడు
చేస్తాయి మా గాలిని శుభ్రం
అవి గాలిని శుభ్రం చేసే
మహోన్నత మహా యంత్రాలు…
ఇంట్లోనే కరోనా నియంత్రణ!

ప్లేగు, మసూచి
ఎన్నింటినో తరిమికొట్టాం
నిన్ను తరమడానికి శ్రమిస్తున్న
మా ప్రభుత్వ యోధులకు వందనాలు
జైహింద్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here