పదసంచిక-54

0
3

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. రాజాధిరాజ కాదుకదా యమధర్మరాజ (6)
4. క్యాలెండరు (4)
7. కుండపోతలో అబ్బాయీ అట్నుంచి వెళ్లిపోయి బల్లేన్ని తీసుకురా! (2)
8. చిగురించిన లేతకొమ్మను తలనరికి తిరగేసినా తేడా లేదు.(2)
9. రఘువంశ సుధాంబుధి అయ్యరుగారు యుద్ధానికై ఉవ్విళ్ళూరుతున్నారు. (7)
 11. ఱాయి మధ్యలో ప్రథమాబహువచన ప్రత్యయమును చొప్పిస్తే వల్లభ దర్శనం.(3)
13. కబ్బినహాలు అని కన్నడలో చెబితే ఏం అర్థమౌతుంది? తెలుగులో వాగు. (5)
14. రాజబాబు లేదా రమణారెడ్డి లేదా రేలంగి (5)
15. సంతసం (3)
18. భరాగో గారి కథాసంపుటి తహతహతో తిరగబడింది (4,3)
19. విప్లవ రచయితల సంఘం వారు కాచే చారు. (2)
21. గాంధీ సినిమాలో సర్దార్ వల్లభభాయి పటేల్ పాత్రను పోషించిన నటుడు.(2)
22. పాతకాలపు నాణెము.(4)
23. బలివాడ కాంతారావుగారి కథలపుస్తకం అపసవ్యదిశలో (6)

 

నిలువు:

1. వైకుంఠము ఆరంభంలో తొలియచ్చుతో ప్రతిక్షేపిస్తే ఇక అడ్డే లేదు. (4)
2. పరాజితకు మోక్షములేకపోతే అనుకూలము. (2)
3. రాయప్రోలువారి ఏదేశమేగినా గేయం వారి ఈ కావ్యసంపుటిలోనిది. (5)
5. ఆడుపంది నడుం విరగ్గొడితే చంఘీజ్ ఖాన్‌ను సృష్టించినవాడొస్తాడు. (2)
6. సండ్రీగూడ్స్ (6)
9.  ఆంధ్ర ‘హెలెన్’తో అబ్బూరి వరద కవితాసరసం (7)
10. కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలం క్రింది నుండి. (3,4)
11. మురిపాలు సరిచేసి వైశాల్యము కనిపెట్టు (3)
12. పోరంబోకును పందికొక్కులో వెదుకు. (3)
13. కుప్పతొట్టిలో ఉండేది.(6)
16.  భానుమతి లేదా విజయనిర్మల లేదా సావిత్రి (5)
17. అలన్ డొనాల్డ్, షాన్ పొలాక్, గ్యారి కిర్‌స్టెన్ వంటి దిగ్గజాలున్న క్రికెట్ టీము. (4)
20. ఆంధ్రజ్యోతిలో వసంతలక్ష్మి చేసే కామెంట్స్ (2)
21. కారిపోవడం దీని లక్షణం. (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 మే 26 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 మే 31 తేదీన వెలువడతాయి.

పదసంచిక-52 జవాబులు:

అడ్డం:                                 

1.ఏదేశమేగినా 4.అభిరుచి 7.కవి  8.పీల  9.ఉత్పలబాంధవుడు  11.జలుబు 13. స్వావలంబన  14.లుక్షలదిప 15.ముసుగు  18.మురదూకజిమాసా  19.తిరి  21.నాకో  22.కక్షాపటం  23.యజమానురాలు

నిలువు:

1.ఏకపక్షం 2.దేవి 3.నాటుబాంబులు 5.రుపీ 6.చిలగడదుంప 9.ఉత్ప్రేక్షాలంకారము 10.డుయునాలనాదసా 11.జనము 12.బులుగు 13.స్వాధీనపతిక  16.సురకన్నియ  17.వీడుకోలు 20.రిక్షా 21.నారా

పదసంచిక-52కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఈమని రమామణి
  • భాగవతుల కృష్ణారావు
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పెయ్యేటి సీతామహాలక్ష్మి
  • రంగావఝల శారద
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here