[dropcap]కొ[/dropcap]న్ని అడగడాలకి
అడక్కపోవడాలకీ మధ్య
ఏముంటుంది
ఉదయానికీ
సాయంత్రానికీ మధ్య
నిలిచే ఒక శూన్యం
ఆకాశమంత సాక్ష్యమౌతుంది
వేదనతో రగిలే
మౌనమొకటి జ్వలిస్తూ
పుప్పొడిలా రాలిపడుతుంది
పలకరించనుకూడా లేని
బంధమేదో
నిట్టూర్పు చూపై గూడుకడుతుంది
అంతర్లీనంగా
నిదురపోనీని మౌనమొకటి
ఆశగా తొంగి చూస్తుంటుంది