[dropcap]నీ[/dropcap]తో పున్నమి నాడు
చంద్రుని సాక్షిగా
చేతిలో చేయి వేసుకుని
నడవాలనుంది
నక్షత్రాల వానలో
చిట పట మెరుపులలో
నిన్ను తడిపేయాలనుంది
సడికాకుండ పూతోటలోకి
నిన్ను తీసుకెళ్లి
గులాబీ సన్నజాజులతో
నిను ముంచెత్తాలనుంది
నీ కనులు మూసి
నింగీ నేల కలిసేచోట
సన్నని ఇసుకలో గీతలు గీస్తూ
ఆకాశంలోకి తొంగిచూడాలనుంది
నీతో మౌనంగా నడిచే నడక అమూల్యం
నీ కనులతో నా చూపుల మారకం అపూర్వం
నువ్వు వెళ్ళాక నే పడే నీ భావ వేదన అనిర్వచనీయం
నీపై నా అనురక్తి, నాపై నీ పాశం
అదే మన ఇద్దరి ప్రేమ సంరంభం
ఎన్నెన్నో జన్మల పెనవేసుకున్న బంధం
మన మనసులు తొంగి చూసుకునే అచ్చమైన అద్దం!