[dropcap]వి[/dropcap]శ్వవృక్షానికి
ఒక చీడ పట్టింది..
కంటికి కనపడకుండా ఉన్న
ఆ చీడకి
కాండం,కొమ్మలు,ఆకులు,మొగ్గలు,పుష్పాలనీ
ఏ తేడా లేదు…
కాండం బలమైనదే అన్పించినా
కొమ్మలు విరగవేమో అనుకున్నా
ఆకుల్లో హరితరసాయనాలున్నా
మొగ్గలు అపుడే కదా తొడుగుతున్నవి
అన్పించినా…..
పుష్పాల సౌందర్యాన్ని సైతం
చీడ పీడ వదల్లేదు..
ఆఖరికి వృక్షపు వేళ్ళపై
చీడ విడువకుండా విషం చిమ్మింది..
అదేమి అబ్బురమో..
ఒకటి సుదృఢంగా ఉంది..
ఆ ఒక్కటి “తల్లి వేరు”
తల్లివేరు ని చీడ చీల్చలేకపోయింది
చీడ పట్టిన ఆ కొన్ని వేర్లే
సంస్కృతికి దూరమైన
కొందరు మానసికరోగులు
సౌందర్యానికే ప్రాముఖ్యత నిచ్చె కొన్ని దేశాలే పుష్పాలు..
చిన్న చిన్న దేశాలే మొగ్గలు
విజ్ఞాన రంగాల్లో ఉన్న దేశాలే పత్రాలు
భౌతికవాదంతో బతికే కొన్ని దేశాలే కొమ్మలు
అగ్రరాజ్యంగా అహంకరించే పెద్దన్న కాండం….
విశ్వవృక్షానికి పట్టిన ఆ చీడ ‘విషకరోనా’
అయితే
విశ్వమనే వృక్షానికి
“తల్లివేరు భారత సంస్కృతి”
ఆ తల్లివేరుకి మరింత జీవం పోద్దాం
విశ్వవృక్షాన్ని రక్షించుకుందాం..