[dropcap]లా[/dropcap]క్‌డౌన్! లాక్‌డౌన్! లాక్‌డౌన్!
మా మనశ్సరీరాలు హూనం…
మేలుకొలుపు పాడే ప్రభాత నేస్తం – ఊహూ
దబ దబ బాదే దోబీ నేస్తమూ రాదు!
ఆఫీసుకు వెళ్ళే బాస్ ఇంట్లోనే
టి.వి.కే. కాదు –
ఇంటికీ రిమోట్ కంట్రోలర్…!
మనో వికలం కరోనా వార్తలు
గుండెలవిసే శబ్ద కాలుష్యం
కంప్యూటర్ కీ బోర్డ్‌ని తడిమే అమ్మాయి వేళ్ళు
వంటింటి గోల వద్దంటున్నాయ్!
సెల్‌ఫోనే లోకమనే అబ్బాయి
కిచెన్‌లో నాకేం పని మగానుభావుడ్ని!
నాలుగయిదు సార్లు టీ, కాఫీలు
ముప్పూటలా భోజనాలు…
వంటిల్లే కైలాసం…
అమ్మా! కరోనా కోవిడ్ నైన్‌టీనూ!
నువ్వూ పురుష పక్షపాతి వేనూ!