[dropcap]ప్ర[/dropcap]పంచమంతా కరోనా మహమ్మారి భీతితో అల్లకల్లోలంగా ఉన్న రోజులివి. సమాజంలో భయం, నిర్వేదం అధికంగా కమ్ముకుంటున్నాయి. వ్యక్తులు సంస్థలు తమ తమ సేవలతో ఆర్తులకు సేవలందిస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. పీడకల లాంటి ఈ చేటుకాలం వదిలిపోతుందని కవులూ, రచయితలూ తమ తమ రచనల ద్వారా ఆశిస్తున్నారు. కొన్నాళ్ళు కరోనాతో కలిసి బ్రతకక తప్పదన్న వాస్తవాన్ని ప్రపంచం ఇప్పుడిప్పుడే గుర్తిస్తోంది. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ నడుచుకుంటే ఈ మహామ్మారిని దూరం చేయగలమన్న ఆశ కలుగుగుతుంది.
ఈ సమయంలో విడుదలవుతున్న 1 జూన్ 2020 సంచికలో ఇదే స్ఫూర్తి నిండిన రచనలతో పాఠకుల ముందుకు వస్తోంది.
ఈ సంచికలోని రచనల వివరాలు:
వ్యాసాలు:
- కచుడు దేవయాని – అంబడిపూడి శ్యామసుందర రావు
- అమ్మ కడుపు చల్లగా-3 – ఆర్. లక్ష్మి
కాలమ్స్:
- రంగుల హేల-27- “దయామయులు కురిపిస్తున్నహిమ సమూహాలు” – అల్లూరి గౌరిలక్ష్మి
కథలు:
- అలా బతికించాను – గంగాధర్ వడ్లమన్నాటి
- లాక్‌డౌన్ 1,2,3,4 – పినిశెట్టి శ్రీనివాసరావు
- కరోనా…. కరోనా – చలపాక ప్రకాష్
- ద బ్రాండ్ – కాళ్ళకూరి శైలజ
- ప్రాణశక్తి – దాసరి శివకుమారి
- పెరటి మొక్క – అత్తలూరి విజయలక్ష్మి
కవితలు:
- పలుకరిస్తూ ఉండు – శ్రీధర్ చౌడారపు
- మధ్య… – డా. విజయ్ కోగంటి
- తల్లివేరు – సామల కిరణ్
- అచ్చమైన అద్దం – Savvy
- ఒక ‘ఉదయ’పు ప్రభవంలో – కొత్తపల్లి ఉదయబాబు
- పురుష పక్షపాతి – పుట్టి నాగలక్ష్మి
గళ్ళ నుడికట్టు:
- పద ప్రహేళిక 6: దినవహి సత్యవతి
పుస్తకాలు:
- ‘సరస్వతీ సంహారం’ కన్నడ నవల – పుస్తక పరిచయం – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
భక్తి:
- చిత్రగుప్తుడి నోము – డా. జొన్నలగడ్డ మార్కండేయులు
త్వరలో మరికొన్ని కొత్త ఫీచర్స్, ఇంటర్వ్యూలు, ధారావాహికలతో సంచిక పాఠకులను అలరించనుంది.
సంచికపై మీ ఆదరణని ఇలాగే కొనసాగిస్తారనీ ఆశిస్తున్నాము.
సంపాదక బృందం.