వారెవ్వా!-32

0
3

[dropcap]సె[/dropcap]క్యులర్ రాజ్యాంగమందున
సమానములే మతములన్ని.
బాధ్యతలు, హక్కులకు గూడా
హద్దులన్ని సమానమనిరి.
ప్రార్థనలు వేరైన గానీ
భక్తి భావమ్మొక్కటనిరి.
ఎవరి విశ్వాసమ్ము వారిది
గాయపరుచుట నేరమనిరి.
రాతలకు నిర్మాతలైనా
చేతలలో చేదనుభవాలు.

***

మెజార్టీలు, మైనార్టీలకు
ప్రార్థనాలయములు సురక్ష.
అన్ని విశ్వాసాల భక్తులు,
అర్పింతురు పైస, ఫలము.
కానుకలు ఆలయము వృద్ధికి,
పూజారుల భుక్తి కోసం.
హిందూ దేవాలయములందు
ఆ పద్ధతి పనికిరాదట.
ఆదాయము నుండి సర్కారు
పంచుకొను వాటాలదేల?

***

మైనార్టీ ప్రార్థనాలయము
ఆదాయము వారి సొంతము.
మెజార్టీల ఆలయమ్ములది
ఆదాయము ప్రభుత కెందుకు?
మైనార్టీ సంక్షేమ ఖర్చు
మెజార్టీ దేవుళ్ళది.
ఎక్కడున్నది సమానత్వము,
హిందువుల కన్యాయమాయె.
మెజార్టీ అనైక్యతయే
అన్యాయాని కాధారము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here