[dropcap]క[/dropcap]రోనా తెచ్చింది పెద్ద తంటా
మూతికి మాస్కులేసుకోవాలంటా
చేతులు శుభ్రంగా కడుక్కోవాలంటా
గడప దాటి బయటకి వెళ్ళకూడదంటా
స్నేహితులతో కలిసి ఆడుకోకూడదంటా
ఊసుపోక రోడ్డెక్కితే పోలిసంకుల్ కొడతారంటా
ఏం తోచక బోర్ కొట్టి తాతకి ఫోన్ చేశానంటా..
తాత చెప్పిందేమిటంటారా..
అమ్మకి పనుల్లో సాయం చెయ్యాలంటా
అల్లరి పూర్తిగా మానేయాలంటా
ఎక్కాలు, లెక్కలు నేర్చుకోవాలంటా
బొమ్మలు గీసి, రంగులు వేయాలంటా
అమ్మకు, నాన్నకు చూపించాలంటా
పశుపక్ష్యాదులను ప్రేమించాలంటా
ఉన్నంతలో దానం చెయ్యాలంటా
సామాజిక దూరం పాటించాలంటా..
కరోనాను తరిమి కొట్టాలంటా
స్వీయనిర్భందమే చక్కని మార్గమంటా..
ఇంత మంచి మాటలు చెప్పిన తాత ఎవరంటా..
మన ప్రధాని మోడీ తాతగారంటా!
తాత మాట విందామంటా..
దేశానికి మంచి పేరు తెద్దామంటా!