పదసంచిక-57

0
6

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. నేరేడు చెట్ల వరుసతో తంతు (6)
4. అడ్డం1లో దీని అవసరం ఉంటుంది చాలామటుకు. (4)
7. జాగరణంలో యుద్ధం లేకున్న చోటు.(2)
8. బైరాగి కాలు విరగ్గొడితే కాని పల్లకీని మోయడు కదా. (2)
9. జాన్ కీట్స్ వ్రాసిన  Ode on a Grecian Urnను తెలుగులో అనువదిస్తే దాని పేరు ఇలా ఉంటుంది. (2,5)
 11. రావత్తు లేని కూతురుతో బిచ్చం (3)
13. ఆంధ్రకేసరికి పుట్టినరోజు కానుకగా విశ్వనాథ 1946లో అంకితమిచ్చిన నవల. (5)
14. వమ్ముచేయుట (5)
15. భావనాజగతిలో అడవిమేక (3)
18. సప్తస్వరాల్లో ద్వితీయతృతీయాలు అపసవ్యంగా (7)
19. కమల్ హాసన్ నటించిన ఒకానొక చిత్రం తిరగేసి. (2)
21. తిండి, గ్రాసం (2)
22. వలమురి, పముజులతో శృంగారగర్వం (4)
23. సిఫారసు (6)

నిలువు:

1. పేచీ (4)
2. బూరుగలో డ్రాగన్ ఫ్లై (2)
3. స్వప్నంలో అనుకూలవతి కాదు నది. (5)
5. అర్ధ శతం (2)
6. ఇదివరకు మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక మండల కేంద్రం. ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారింది. (6)
9.  వేంపల్లి గంగాధర్ పుస్తకం (4,3)
10. అధిక మూల్యం కలది తంపులమారి కడుపులో పడితే ఇక్కడి మాటలక్కడ, అక్కడి మాటలిక్కడ చెప్పువాడు అవుతాడు. (7)
11. పుటుక, జనమ (3)
12. తొలకరిజల్లులోని భక్ష్యవిశేషము (3)
13. అడ్డం 1 లాంటిదే. (6)
16.  ఒక రాగవిశేషం. (5)
17. మూడు వేదములే శరీరముగా కల శివుడు (4)
20. నమ్మిక (2)
21. పొట్టేలు తెచ్చిన ఏలకులు (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూన్ 16 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూన్ 21 తేదీన వెలువడతాయి.

పదసంచిక-55 జవాబులు:

అడ్డం:                                 

1.కాగితం పడవ 4. ఘృతేళిక 7. హరి 8. జౌరు. 9. రెండవ పులకేశి 11. బాడుగ 13. గవడపేరు 14. లీలానాయుడు 15. వాకబు 18. పత్తిపాటి రామయ్య 19. పేచీ 21. కోర 22. టలనము 23. లక్ష్మీనారాయణ

నిలువు:

1.కాహళము 2. గిరి 3. వలపురేడు 5. ళిజౌ 6. కరుణామయుడు 9. రెండు జడల పాప 10. శివలెం నాగమయ్య 11. బారువా 12. గలీబు 13. గవర్నరుపేట 16. కమ్మటి కల 17. విచారణ 20. చీల 21. కోయ

పదసంచిక-55కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అభినేత్రి వంగల
  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఈమని రమామణి
  • కన్యాకుమారి బయన
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పొన్నాడ సరస్వతి
  • రంగావఝల శారద
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here