[dropcap]దూ[/dropcap]రం దూరం వెళ్ళండి
అసింటా జరగండి
ముట్టకు తట్టకు నన్ను
మూడడుగుల దూరంలో ఉండు
మూతికి మాస్కు వేస్కో
చేతికి సబ్బు పూస్కో
వైరి వైరసు వచ్చింది
అతలాకుతలం చేసింది
దూరంగా ఉంటేనే
బంధం దగ్గర అవుతుంది
దగ్గరగా వస్తేనే
ప్రాణం దూరం అవుతుంది
దూరాన్ని దగ్గరగా ఉంచండి
దగ్గరని దూరంగా చేయండి
అందరూ ఆరోగ్యంగా ఉండండి