[dropcap]చం[/dropcap]ద్రుడు చేసిన తపస్సుకు
వెన్నెల… వరమైనట్టు
ప్రకృతి తాను పడిన తపనకు
పచ్చదనం బహుమతైంది… నీలా
అందుకేనేమో
నీ చెలిమి నా మనసున గుబాళిస్తుంది
శుభోదయాన సుఖ పర్ణికలా…..
మేఘపు జల్లులలో
నీవు దిద్దిన జ్ఞాపకాలు తడిసిపోతున్నా
నా మనసు హరివిల్లై నర్తిస్తుంది… నెమలీక లా
నీ ఉహల మల్లెల పొదరిల్లు
నా మసున విరబూస్తుంది
నీ మధుర హాస ప్రభాత సుమంలా…..