[dropcap]గ[/dropcap]గన మంతా శూన్యమైనా వెలుగు లెన్నెన్నో
మౌన మెంతో దైన్య మైనా తెఱుగు లెన్నెన్నో.
ఏటి గట్టున చీకటంచున ఎన్ని మారులు నిలిచినా
దాటిపోయే ఏటి సుడు లకు పరుగు లెన్నెన్నో.
విరహ వేదన మనసులోనే మాయ చేస్తున్నా
వెండి వెన్నెల నిన్ను చూస్తే తరుగు లెన్నెన్నో.
సుప్రభాత నవోదయమ్మున నన్ను నేనే మరచినా
నీ ఎదను తాకిన చీర చెంగుకు చెరుగు లెన్నెన్నో.
ప్రేమ భాషకు ఓనమాలు అమ్మ ఒడిలోనే ‘శ్రీయా’
నీవు నేర్పే ప్రణయ భాషకు మెరుగు లేనెన్నో.