చనిపోయిన గాయాలు

0
3

[dropcap]బ[/dropcap]హుశ
మళ్లీ ఒక సూర్యుడు ఉదయించవచ్చు
ఆకాశంలా
నా జీవితం వ్యర్థం కాదనిపించవచ్చు
శిశిరం వెళ్ళిపోయినా
మళ్ళీ ఒక వసంతం తాకవచ్చు
ఎర్రటి గులాబీలు తలలూపుతూ
నన్ను పలకరించవచ్చు
వేసవి అడవుల్లో చల్లదనం
ఆకుపచ్చగా అలరించవచ్చు
అలలై ఎగిసిపడే సముద్రం
ఆర్తిగా కౌగిలించవచ్చు
ఆకాశంలోని నక్షత్రాలు
అరిచేతిలో మెరిసిపోవచ్చు
ఎక్కలేననుకున్న శిఖరాలను
చేరుకుని కిందికి చూడవచ్చు
మెచ్చనివాళ్ళు కూడా
మౌనంగానే తలలూపవచ్చు
బహుశ
ఒకరోజు వేదనతో నేను అశృవునైనప్పుడు
జాలిగా చూస్తూ జారిపోయిన కాలం
మళ్లీ ఒకసారి నాకోసం వెనక్కి రావొచ్చు
కానీ నేను పోగొట్టుకున్నది
చాలా గొప్ప విషాదానందం
ఎందుకంటే
దానిని చేజార్చుకున్న నా హృదయం
ఏనాడో ముక్కలై పోయింది
ఆ గాయాలుకూడా రోజూ మరణిస్తూనే ఉన్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here