[dropcap]ఏ[/dropcap]మీ తెలియని లోకంలోకి
ఎవరూ కాకుండా వచ్చి
అందరూ తన వారనుకుని
ఎన్నో బంధాలు పెంచుకుని
చెట్టాపట్టాలేసుకుని
చుట్టాలను పక్కాలను చేసుకుని
అందరూ తనవారనుకుని
భ్రమిస్తూ పరిభ్రమిస్తూ
అందులోనే మునిగి తేలుతూ
సాగుతున్న పయనంలో
అసలు నిజం తెలిసే వేళ
ఆవలి ఒడ్డుకు చేరే వేళ
అంతా అయోమయం
అన్నీ అగమ్యగోచరం
అన్నీ తెలుసనుకున్న
అహంభావం అంతా ఆవిరైన వేళ
ఏమీ తెలియకుండానే
పడమర దిక్కుకు జారిపోతామంతే