“వేటగాడు ఏసిన బాణం కాలికి తగిలి మన దేవాది దేవుడు కిష్ణ దేవుడు
సచ్చిపోయ కదనా?”
“అవునురా”
“ఏసు ప్రభువుని మళలు (మేకులు) కొట్టి చంపిరి కదనా?”
“నిజమురా”
“ఇంగ అల్లా దేవుడు కూడా కాయిలా వచ్చి సచ్చిపోయినంటా?”
“అవును… అవునురా?”
“ఏలనా ఇట్ల దేవది దేవుళ్లకి ఇట్లా సావు ఏల వచ్చెనా?”
“రేయ్! వీళ్లకే కాదురా ఈ భూలోకములా దేవుళ్లమని, దేవుని
వారసులమని కీర్తి పొందిన వాళ్లు సచ్చిపోయిరిరా”
“అదే ఏల ఇట్లాయ అని అడగతా వుండానా”
“ఏలంటే దేవుడైన జీవుడైన అంతా ప్రకృతమ్మ బిడ్డలేరా.
అమ్మ ఒడిలో పుట్టి, పెరిగి, వొరిగి పోవాల్సిందేరా”
“అవునా మడి బూలోక జనాలు అంటారు మా దేవుడంటే మా
దేవుడే ప్రకృతమ్మని పుట్టిచే” అని అంట్ని.
“నాకి అదే సందేహమురా వీళ్లే ప్రకృతమ్మని పుట్టిచ్చి, పెరిగి
చింటే వాళ్ల ప్రకృతమ్మని ఎదిరిచ్చి నిలవలేదని ఏల సచ్చిరని” అని అనె.
“అవును కదా!” అని నాలా తిరగా సందేహము సురువాయ.
***
సచ్చిరి = చనిపోయిరి