పదసంచిక-59

0
51

‘పదసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. ఎన్నార్ చందూర్ కథా సంకలనం.చెన్నై సమీపంలోని పర్యాటకప్రాంతం కూడా. (6)
4. ఉమ్మి ఊచు పాత్ర (4)
7. ముక్కుపొడుం (2)
8. శ్రీ ప్రదము (2)
9. దిండి జలాశయము. మూడో అక్షరం చివరకు పోయింది. (7)
11. దడ (3)
13. కూచిపూడి నృత్య కళాకారులు ప్రదర్శించే ఒక నృత్య రూపకం. (5)
14. అధిక ధర కాదు. (3,2)
15. సంపెంగ (3)
18. బాలాంత్రపు రజనీకాంతరావు గేయ సంపుటి (7)
19. కె.వి.మహదేవన్ ముద్దు పేరు. (2)
21. రామఠములోని కాంతి. (2)
22. అశోక సామ్రాట్టు కుమార్తె. బౌద్ధ సన్యాసిని. (4)
23.  పిండిని నూరడం. చెప్పిందే చెప్పడానికి ఉపయోగించే జాతీయం. (2,4)

నిలువు:

1. ఎర్రమట్టి నేల (4)
2. నవరసాల్లో ఒకటి (2)
3. కాంచనపల్లి కనకమ్మ వ్రాసిన శతకం (5)
5. కాష్ఠము (2)
6. కందుకూరి అనంతము కలం పేరు. (6)
9. లాస్ట్ హోప్ (3,2,2)
10. 1961లో వచ్చిన ఓ డబ్బింగ్ సినిమా.(4,3)
11. విశ్వం (3)
12. యుద్ధభూమి (3)
13. వినాయక చవితి ఈ నెల్లోనే వస్తుంది. (4,2)
16. పరీక్షిత్ సాహ్ని, తనూజ నటించిన హిందీ సినిమా.(3,2)
17. శంకరమఠములో తాబేలు. (4)
20. మొక్కజొన్నలు (2)
21. మనోహరము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూన్ 30 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూలై 05 తేదీన వెలువడతాయి.

పదసంచిక-57 జవాబులు:

అడ్డం:                                 

  1. జంబూల మాలిక 4. షామియానా 7.జాగ 8. బైరా 9. గ్రీకు కలశ గీతం 11. పుతిక 13. కడిమిచెట్టు 14. రిత్తపుచ్చుట. 15. వనాజ 18.లురాధాగాంభషరి 19. ణగు 21. మేత 22. మురిపము 23. రికమెండేషను

నిలువు:

  1. జంజాటము 2. బూగ 3. కల్లోలవతి. 5. యాబై 6. నారాయణపేట 9. గ్రీష్మభూమి కథలు 10. తంగరాపుల మారి 11. పుట్టువ 12. కరిజ 13. కరగ్రహణము 16. నాగగాంధారి 17. త్రయీతను 20. గురి 21. మేష

పదసంచిక-57కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • అనురాధ సాయి జొన్నలగడ్డ
  • ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
  • కన్యాకుమారి బయన
  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • పడమట సుబ్బలక్ష్మి
  • పద్మశ్రీ చుండూరి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పెయ్యేటి జానకీ సుభద్ర
  • పెయ్యేటి సీతామహాలక్ష్మి
  • రంగావఝల శారద
  • టి. రామలింగయ్య
  • తాతిరాజు జగం
  • శంభర వెంకట రామ జోగారావు
  • శిష్ట్లా అనిత
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here