వారెవ్వా!-35

1
2

[dropcap]గి[/dropcap]ల్లి-కజ్జ చైనా మోసము
విశ్వమంతట విదితమాయె.
పక్క రాజ్యము నాక్రమించుట
కంతు, ఆధారమ్ము లేదు.
నాడు భారత భూమి లఢక్‌న
వేల కిలోమీటర్లు కబ్జ.
చిన్న రాజ్యము ప్రాంతాలను
తిన్నగా మింగేయుచుండె.
నేడు మన ప్రాంతాల పైన
కన్ను వేసెను రాక్షసత్వము.

***

కడుపు నిండా కత్తులుండగ
మాట లోనె మధుర ధారలు.
భాయి భాయి అంటూనే
ప్రాణాలను దీయుచుండిరి.
ప్రాణ స్నేహితమంటూనే
పిశాచాలుగా మారినారు.
దొంగ దెబ్బకు ప్రయత్నించి
డొక్లా మందు దెబ్బతినిరి.
మచ్చ జల్లుచు మాయ జేసిరి
గల్వాన్ లోయ సమీపమున.

***

దొంగతనమున హద్దు దాటియు
నిర్మించిన చెక్ పోస్టునే
కల్నల్ సంతోష్ బాబు బృందము
కకావికలు చేయు చుండగ,
నలభై చైనీయులను జంపి
ఇరవై ప్రాణాల నిచ్చిరి.
వీర భారత పాద యుగళికి
పారాణిగ పల్ల వించిరి.
తెలంగాణా ముద్దు బిడ్డా!
కల్నల్ సంతోష్ జోహార్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here