మట్టి

1
3

[box type=’note’ fontsize=’16’] “మట్టిని నమ్ముకోలేక, అమ్ముకుంటున్నాడు మనిషి రూపాన భస్మాసురుడు” అని వాపోతున్నారు కవి మట్టిపై రాసిన ఈ నానీలలో. [/box]

[dropcap]మే[/dropcap]ఘం
వాన చుక్కగా మారింది
విత్తు వొడి
మెత్తగా విచ్చుకుంది

జననం నుంచి
మరణం వరకు
తిరిగేదంతా
ఈ మట్టి చుట్టే

మొక్క పెరిగింది
మృత్తిక తల్లి చలువన
అదే
తల్లి బిడ్డల బంధం

మట్టిని నమ్ముకున్న
దేశ వెన్నెముకలు
తాగుతున్నాయి
ఎండ్రిన్ సీసాలు

మట్టిని నమ్ముకోలేక
అమ్ముకుంటున్నాడు
మనిషి రూపాన
భస్మాసురుడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here