[dropcap]సం[/dropcap]చిక పత్రికకు పెరుగుతున్న పాఠకాదరణ ఎంత ఆత్మవిశ్వాసాన్నిస్తోందో, సంచికకు రచనలందించాలన్న రచయితల ఆసక్తి ఉత్సాహాలు అంతగా ఆనందం కలిగిస్తున్నాయి. పలు విభిన్నమయిన రచనలు, విశిష్టమయిన రచనలు, వినూత్నమయిన రచనలతో సంచికను మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని అనుక్షణం ప్రయత్నిస్తున్నాము. మా ఈ ప్రయత్నంలో పాలుపంచుకుని సంచికను అత్యుత్తమ తెలుగు సాహిత్యవేదికగా నిలపటంలో తోడ్పాటునందించాలని పాఠకులను, సాహిత్యాభిమానులను, రచయితలను సంచిక అభ్యర్ధిస్తోంది, ప్రార్థిస్తోంది.
పాఠకులను ఆకర్షించి సంచికను మరింతగా పాఠకులకు చేరువ చేయాలన్న ప్రయత్నంలో భాగంగానే సరికొత్త సీరియళ్ళను, ఫీచర్లను ప్రవేశపెడుతున్నాము. పాఠకులను అలరించి కశ్మీరాన్ని చేరువ చేసిన నీలమత పురాణం ధారావాహిక త్వరలో పూర్తవుతుంది. నీలమత పురాణం స్థానంలో పాఠకులను అంతకన్నా ఎక్కువగా ఆకర్షించటమేకాదు, ఉపయోగకరంగా వుండే శీర్షిక ఆరంభమవుతోంది. ఆ శీర్షిక వివరాలను సంచిక రాబోయే సంచికల్లో ప్రకటిస్తాము. అలాగే, తెలుగు సాహిత్యంలో సమకాలీన రచయితల్లో ఎవరికి వారు దిగ్గజాలు, తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశనం చేసిన మార్గదర్శక రచయితలుగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో సాహిత్యాన్ని ఎలా చదవాలి, ఎలా అర్థం చేసుకోవాలి వంటి విషయాలను వివరిస్తూ, ఇంతవరకూ తెలుగు సాహిత్య విమర్శను పాశ్చాత్య సూత్రాల ఆధారంగానో, వామపక్ష సాహిత్య విమర్శ సూత్రాల ఆధారంగానో బేరీజు వేస్తున్న తెలుగు సాహిత్య ప్రపంచాన్ని భారతీయ సాహిత్య విమర్శ పద్ధతుల ద్వారా సాహిత్య విమర్శ చేసే దిశలో అడుగువేయించాలన్న లక్ష్యంతో ఒక సాహిత్య ఫీచర్ త్వరలో ఆరంభమవుతుంది. ఈ శీర్షిక ద్వారా ఒక రచనను అంచనా వేయటం సామాన్య పాఠకుడికి చేరువ చేయాలన్నది లక్ష్యం. అప్పుడు పాఠకులు రంగుటద్దాల, కళ్ళకు గంతల, ధృతరాష్ట్ర సమానులయిన విమర్శకులపై ఆధారపడకుండా తమంతట తామే ఒక రచనను చదివి నిగ్గు తేల్చుకునేట్టు చేయాలన్నది ఉద్దేశం. తద్వారా మాఫియా ముఠాల విమర్శకుల ధృతరాష్ట్ర కౌగిలి నుంచి, కంటిదోషాల విమర్శకుల కబంధ హస్తాల నుంచి తెలుగు సాహిత్యానికి విముక్తి కలిగించి, అసలయిన సాహిత్యానికి పెద్దపీట వేసి, అసలయిన రచయితలకు తగిన గుర్తింపు లభించే దిశలో ఒక అడుగు వేసినట్టవుతుందన్నది సంచిక ఆశ.
నెల నెలా అందిస్తున్నటే ఈ నెల సంచిక అందిస్తున్న రచనల వివరాలు:
ప్రత్యేక వ్యాసం:
- మోక్షగుండం బాటలో నడిచిన శేషాచారి
వ్యాసాలు:
- శ్రవ్య కావ్యేతివృత్తం – కోవెల సుప్రసన్నాచార్య
- ఓ మంచి పాత కథ ‘రక్త స్పర్శ’ – అంబడిపూడి శ్యామసుందర రావు
- అమ్మ కడుపు చల్లగా-4 – ఆర్. లక్ష్మి
- మధ్య తరగతి జీవనానికి ‘విలువలు’ చేకూర్చిన బెహరా వెంకట సుబ్బారావు – కె.ఎస్.ఎస్. బాపూజీ
కాలమ్స్:
- రంగుల హేల-28- ‘ఊహా సుందరీమణులూ… వాస్తవ భార్యామణులూ’ – అల్లూరి గౌరిలక్ష్మి
కథలు:
- ప్రవాహం – అత్తలూరి విజయలక్ష్మి
- దైవం మానుష రూపేణ – గాడేపల్లి పద్మజ
- ఇంటి గోల – వీధి గోల – డా. చివుకుల పద్మజ
- రాకాసి కెరటాలు – శశికళ ఓలేటి
- కొత్త కోక – దామరాజు రామ్‌కుమార్
- సుతుడవై… తల్లివై – డా. చెంగల్వ రామలక్ష్మి
- మనసున మనసై – చిన్మయి
- పునరుత్థానం – డా. మధు చిత్తర్వు
కవితలు:
- చప్పట్లు మెషీన్లు ఇక తెప్పించాల్సిందే – శ్రీధర్ చౌడారపు
- నువ్వొక – డా. విజయ్ కోగంటి
- ప్రయత్నం – ఆర్. ఎస్. వెంకటేశ్వరన్
- బతుకు పుస్తకంలో కొత్త అధ్యాయం – పి.వి. ప్రసాద్
- చావా శివకోటి మినీకవితలు – చావా శివకోటి
- నేను నేర్చుకున్న ప్రకృతి పాఠాలు – కుమారి కొరముట్ల
- మట్టి – శింగరాజు శ్రీనివాసరావు
- ఆగమనం – చిట్టె మాధవి
గళ్ళ నుడికట్టు:
- పద ప్రహేళిక 7: దినవహి సత్యవతి
భక్తి:
- శ్రీ రాముల వారి అక్క – డా. జొన్నలగడ్డ మార్కండేయులు
బాలసంచిక:
- కపీశ్వర్‍లో మానవత్వం – కంచనపల్లి వేంకట కృష్ణారావు
- అందమైన చేతులు – ఆదూరి హైమవతి
మీ సలహాలు, సూచనలు రచనలతో సంచికను పరిపుష్టం చేయండి. తెలుగు సాహిత్యాభివృద్ధిలో భాగం పంచుకోండి.
సంపాదక బృందం