‘పదసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. బాదరాయణ సంబంధంలాంటిదే ఈ చుట్టరికం కదా (6) |
4. దివ్యవాణి, భానుమతులతో మోహిని. (4) |
7. బుడుక్కున దాక్కో (2) |
8. ఆవరించని గౌతమితో ఎద్దు. (2) |
9. విష్ణుమాయావిలాసం రచనలో కంకంటి పాపరాజుకు సహకరించిన మిత్రుడు ఈ కవి. (4,3) |
11. లోకము జుట్టిన కపింజలపక్షి (3) |
13. Loves of the Harem నవలకు తెలుగు అనువాదం. (5) |
14. గొబ్బెమ్మలలో అలంకరించే శ్రీపర్ణి ప్రసూనాలు వెనుకనుండి. (5) |
15. ఎడతెరిపి లేని వాన రివర్సులో చెల్లించే ఫీజు (3) |
18. చాలా తక్కువమంది. ఉడ్డా ముగ్గురు అని రాయలసీమ మాండలికం. దాన్నే శ్రీకాకుళం వైపు ఇలా అంటారు. (7) |
19. తొలకరి జల్లు నడుమ సాక్షి (2) |
21. వెనుదిరిగి సంస్కృతంలో తల్లిని సంబోధించు. మందమైనది అగుపిస్తుంది. (2) |
22. ముంబై, మన్మాడ్‌ల మధ్య నడిచే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు వెనుక నుండి. (4) |
23. కొయ్యస్తంభముల పైన అలంకారంగా చెక్కి అమర్చిన దిమ్మ.(6) |
నిలువు:
1. పొరంబోకు. (4) |
2. గోళ్లతో గట్టిగా గీకు. (2) |
3. సిగార్‌తో నెయ్యము (5) |
5. భాగోతంతో లగెట్టు (2) |
6. మత్తగజము (6) |
9. rigmarole, traditional nonsense అని ఆంగ్ల నిఘంటువు చెబుతోంది. (7) |
10. వీరు లేరని రామదాసుని పలుకులు. (2,3,2) |
11. కాలి నల్లనగు (3) |
12. ఋత్విజులు మున్నగువారి దాష్టీకము (3) |
13. నిప్పుల కుంపటి (6) |
16. హరిణము (5) |
17. నీలివార్త (4) |
20. పరివర్తనలో ఉపశాఖ (2) |
21. ధర్మారావు గారి పనిముట్టు. తొందరేం లేదు నిదానంగానే చెప్పండి. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూలై 14 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూలై 19 తేదీన వెలువడతాయి.
పదసంచిక-59 జవాబులు:
అడ్డం:
1.మహాబలిపురం 4. కళాచిక 7.నస్యం 8. తిరు 9. దిండిలాశయముజ 11. ప్రకంపం 13. భామాకలాపం 14. చవకధర 15. చంపకం 18. శతపత్ర సుందరి 19. మామ 21. రాఠ 22. సంఘమిత్ర 23. పిష్టపేషణము
నిలువు:
1.మనశ్శిల 2. హాస్యం 3. రంగశతకం 5. చితి 6. కరుణకుమార 9. దింపుడుకళ్ళం ఆశ/దింపుడుకళ్ళమాశ 10. జగదేక సుందరి 11. ప్రపంచం 12. పంచకం 13. భాద్రపద మాసం 16. పవిత్రపాపి 17. కమఠము 20. మఘ 21. రాణ
పదసంచిక-59కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- కన్యాకుమారి బయన
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- ఇంకొల్లు బ్రహేంద్రస్వామి
- జానకీ సుభద్ర పెయ్యేటి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- పెయ్యేటి సీతామహాలక్ష్మి
- రాజేశ్వరి కనకగిరి
- రంగావఝల శారద
- శ్రీ వాణి హిరణ్మయి
- తాతిరాజు జగం
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.