[dropcap]త[/dropcap]లపై ఇటుకలు మోస్తూ
తలరాత మార్చుకోవాలని
తన చీరని ఊయల గా చేసి
కలల బంగారం సేద తీరుస్తూ
మండుటెండలో నిరాటంకంగా
బ్రతుకు పోరు కొనసాగిస్తూ
బాధ్యతతో భవిత నిర్మాణానికి
శ్రమిస్తున్న ఆమె జీవన యుద్ధ నారి…
భుజం పై బరువు ఎత్తుకోవాల్సిన వాడు
భుజంగ రీతిలో
కుబుసం విడిచి
విదిల్చి పారిపోయిన నాడు
గుండె బండ చేసుకుని
అడుగు వేస్తేనే మనుగడ…
కూడు గూడు నీడ తోడు
కరవైన వ్యథార్త మానంలో
సంకల్ప బలం ముందు
అల్పమే కష్టాలన్నీ…
విజేత సదా స్వేదమే.