[dropcap]చూ[/dropcap]డాలని ఉంది
కానీ సృష్టిలో కనపడగలదా!?
కనపడేవే ఎక్కువ ఈ సృష్టిలో
కనపడనివి ఇంకెన్నో ఈ సృష్టిలో
ఆ కనపడని అద్భుతాల వెనుక శక్తిని
చూడాలని ఉంది…..
చూడాలని ఉంది
కానీ సృష్టిలో కనపడగలదా!?
పువ్వులోని అందమైన పూరెమ్మలని
నవ్వులోని అందమైన నగుమోముని
సృష్టించిన అద్భుతశక్తిని
చూడాలని ఉంది…..
చూడాలని ఉంది
కానీ సృష్టిలో కనపడగలదా!?
ప్రవహించే నీరెప్పుడు పల్లమే ఉండాలని
దహించే దావాగ్ని ఎప్పుడు పైకే ఉండాలని
సృష్టించిన అద్భుతశక్తిని
చూడాలని ఉంది……
చూడాలని ఉంది
కానీ సృష్టిలో కనపడగలదా!?
భూమ్యాకాశ సౌరమండల జిల్గులు
సూర్యచంద్ర నక్షత్ర నానాది వెల్గులు
సృష్టించిన అద్భుతశక్తిని
చూడాలని ఉంది…….
చూడాలని ఉంది
కానీ సృష్టిలో కనపడగలదా!?
ఉగాదిలోనే వేపపువ్వు పూయాలని
వసంతంలోనే కోయిల కూయాలని
సృష్టించిన అద్భుతశక్తిని
చూడాలని ఉంది………