[dropcap]వే[/dropcap]దాలమ్ముతున్నాం, వేదాంతాన్నమ్ముతున్నాం
మనసులమ్ముతున్నాం, మనుషులనమ్ముతున్నాం
యోగాన్నమ్ముతున్నాం, ధ్యానాన్నమ్ముతున్నాం
ప్రవచనాలు కాసులకిస్తున్నాం
ఊపిరినమ్ముతున్నాం, ఉనికికి సహితం వెల కడుతున్నాం
పంచ భూతాలని విఫణిలో ఫణానికి పెట్టాం
అమ్మని పంచుకుంటున్నాం, అమ్మ ప్రేమల సమయాన్ని నియంత్రిస్తున్నాం
జగం, మారిన యుగ ప్రమాణాల సంగమం
నిరంతర సంఘర్షణల మానవ సమాజ దర్పణం
మనిషి ఒక ద్రష్ట మాత్రమే, స్రష్ట కాదు
మనిషి జీవితం అద్యంత రహిత, అనంత కాల వాహినీ చుంబిత సుందర మనో దర్శిత వనం
నిరంతర మార్పు ప్రకృతి నైజం; వనచర్యం అనంత ధర్మం