లాక్- అన్‌లాక్

5
3

[dropcap]వే[/dropcap]సవి వేడి తరుగుతూ-
విషాద వేడిని పెంచుతూ-
మరో క్రొత్త ఆశల పల్లకీ,
జూలు విదిలిస్తూ-
జూలై మాసం తయార్!!

నడకలేక-నడవలేక,
పెరుగుతున్న బరువు,
లేని తిండి అరుగుదల-
బరువు తరుగుదల.
రోడ్డెక్కితే పోలీస్ లాఠీ-
నూరు రూపాయల ఫైన్ తో టోపీ .
గృహమే కదా స్వర్గసీమ, ఆనాడు-
గృహం ఒక ఉష్ణమండలం నేడు!!

లాక్ పోయి- అన్ లాక్ మొదలై-
మానవజీవితం కుదేలై-
భవిష్యత్తు అగమ్యగోచరమై
తిష్ఠవేసిన భయం-
కనిపించని అభయం!!

భయానికి లాక్ వేసి-
దైర్యాన్ని అన్ లాక్ చేసి-
నిబంధనల నిబద్దతతో-
బ్రతుకు మీదతీపితో-
సాగే జీవనయానం
మన ముందున్న ప్రయాణం!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here