[dropcap]“మ[/dropcap]న దేశానికి స్వాతంత్రము వచ్చి ఎన్నాళ్లాయనా?”
“74 ఏండ్లాయరా”
“మడి, మనకినా?”
“దేశానికి వస్తే మనకి వచ్చినట్లే కదరా”
“నిజమేనా, కాని నేను అడగతా వుండేది ఈ ప్రపంచము లాని జనాలందరు మీరు, నేను ఇట్ల అందరు స్వంతత్రమైన వాళ్లమేనా అనినా”
“నీకేం పోయేకారమురా ఇట్లా మాట అడిగితివి”
“పోయేలోపల తెలుసుకందామనినా?”
“అవునా?”
“ఊనా”
“నాకి తెలీదురా సామి నన్ని యిడి, లేకుంటే నేను స్వతంత్రము అయినోడా కాదా అని నాలానేను ఏచన చేయాల్సి వొస్తుంది”
“ఇట్ల చేయాలనే నేను కలబెట్టింది”
“నీకి తినేకి తాగేకి నడుస్తుంది, ఏల కలబెల్దు కానీకాని”
కలబెట్టు = కలియదిప్పు