[dropcap]రె[/dropcap]క్కలు విరిగిన పక్షిలా
బాల్యం
సాఫ్ట్‌వేర్ జాబ్
డాలర్ల కోసం
పసిప్రాయం
వసివాడుతోంది
అమ్మ నాన్నల
అంతులేని కోర్కెలు సాక్షిగా
బాల్యం నడుం
ఒరిగిపోయింది
బోలెడు పుస్తకాల భారం
వీపున మోయలేక
ఉద్యోగం బిజీలో
అమ్మానాన్నలు
కేర్ సెంటర్ లో
‘కేర్’ మంటున్న బాల్యం
క్లాస్ రూం గోడలు
బావురమంటున్నాయి
బాల్యం నుండే
బాధల్ని చూడలేక