పదసంచిక-62

1
3

[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.

సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.

ఆధారాలు:

అడ్డం:

1. గంభీర సాహెబు గుణింతాలను సరిచేసి ఒక క్రమంలో అమర్చితే వచ్చేది ప్రజలందరూ పాల్గొనటానికి అవకాశం ఉన్న మీటింగు. (6)
4. సాగేను జీవిత నావ ____ లేక ఈ త్రోవ అని తోబుట్టువులు సినిమా పాట. (4)
7. పెసరట్టుతో అపకీర్తి. (2)
8. మానవతలో పదికొకటి తక్కువ. (2)
9. భద్రం వేణుగోపాలాచార్యకు ఉన్న ఈ బిరుదు గరికపాటి నరసింహారావుకూ ఉంది. (4,3)
 11. తోకతెగిన బుడుతడు. (3)
13. ఆధునిక తెలుగు కవి తిలక్ ఇంటి పేరు. (5)
14. అందమైన పార్థీనియం కలుపుమొక్క అటునుంచి (5)
15. కోవిడ్-19 బారిన పడిన పాప్ గాయని (3)
18. మనిషి కనబడుటలేదు అంటున్న సాహిత్య సేవాభూషణుడు. (4,3)
19. కుమ్మరి నాగరాజు పొట్టి సంతకం. (2)
21. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక (2)
22. తిరగబడ్డ వంచకుడు.(4)
23. తప్పటడుగులేసిన తప్పటడుగులు (6)

నిలువు:

1. బారణా కు బెత్తం తెప్పించండి ఎలాగోలా. (4)
2. ఫ్లాపు కాని కన్నడిగుల పిష్టము. (2)
3. భీతిని గొలిపే రాహువు (5)
5. చారులోచన (2)
6. తిరుమల స్వామివారికి సుప్రభాతసేవతో మొదలయ్యే రోజువారీ పూజా కార్యక్రమాలు దీనితో ముగుస్తుంది. (4,2)
9.  నలుపు ఊదా కలిపిన నీలం రంగు. (7)
10. ఎన్.జి.రంగా అనుయాయి. గుంటూరు మండల సర్వస్వం సంపాదకుడు. (4,3)
11. దోస జాతికి చెందిన ఒక కాయ. (3)
12. అప్పన్నా తనామనా కెమెరామెన్ గంగను వెదకన్నా. (3)
13. తండ్రి వాణిశ్రీతో, కొడుకు విజయశాంతితో కలిసి నటించిన రెండు వేర్వేరు సినిమాలకు ఒకే పేరు. (6)
16.  రెండో ఎక్కం అప్పజెప్పమంటే మొదట్లోనే మింగేస్తావేం?
17. ఖురాన్, బైబిల్‌లలో కనిపించే గేబ్రియేల్ లేక జిబ్రాయేల్ (2)
20. డుమ్మా(2)
21. రామఠము (2)

మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూలై 21 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 జూలై 26 తేదీన వెలువడతాయి.

పదసంచిక-60 జవాబులు:

అడ్డం:                                 

1.కనులపండుగ 4. పెనకువ 7. నిన్న 8. రసం 9.చలికొండకూతురు 11. పచ్చడి 13. గరుడపక్షి 14. గిరిజామల 15. లవారా 18. కుబేరుడికూతురు 19. వంత. 21. క్షోద 22. తిరుక్షౌరం 23. మాతృదేవోభవ

నిలువు:

1.కనికట్టు 2. నున్న 3. గరుడపచ్చ 5. కుర 6. వసంతకోకిల 9. చలికొండకొడుకు 10. రుచులజాడవేరు 11. పక్షిల 12. డిగిరా 13. గగనస్రవంతి 16.వాస్కోడిగామా 17. తొమ్మిదవ 20. తరు 21. క్షోభ

పదసంచిక-60కి సరైన సమాధానాలు పంపిన వారు:

  • భాగవతుల కృష్ణారావు
  • చెళ్ళపిళ్ళ రామమూర్తి
  • ఇంకొల్లు బ్రహేంద్రస్వామి
  • ఈమని రమామణి
  • జానకీ సుభద్ర పెయ్యేటి
  • తల్లాప్రగడ మధుసూదనరావు
  • పద్మశ్రీ చుండూరి
  • పద్మావతి కస్తల
  • పడమట సుబ్బలక్ష్మి
  • పాటిబళ్ళ శేషగిరిరావు
  • పొన్నాడ సరస్వతి
  • పెయ్యేటి సీతామహాలక్ష్మి
  • రాజేశ్వరి కనకగిరి
  • రామలింగయ్య టి
  • రంగావఝల శారద
  • శ్రీ వాణి హిరణ్మయి
  • శిష్ట్లా అనిత
  • తాతిరాజు జగం
  • శంభర వెంకట రామ జోగారావు
  • డాక్టర్ వరలక్ష్మి హరవే
  • వర్ధని మాదిరాజు
  • వైదేహి అక్కపెద్ది

వీరికి అభినందనలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here