చావా శివకోటి మినీ కవితలు 2

0
4

[dropcap]చా[/dropcap]వా శివకోటి గారి నాలుగు మినీ కవితలను పాఠకులకు అందిస్తున్నాము.

1.

దేవుడూ
నువ్వున్నావని
ఉంటావని
రాళ్ళల్లో రప్పల్లో
శూన్యాన
వెతికి వెతికి వేసారాను.
నా పిచ్చి గాని
మనిషి మది నున్న నువ్వు
ఎక్కడో ఎందుకుంటావు?

***

2.

ఈ పుడమి నిశ్చలం
మిగిలిందంతా చరాచరం
అవును, చలించాలి
ఆ చలనమే ప్రగతి
అదే మానుషత
జీవన మాధుర్యం.

***

3.

నా కలం సేద్యగాని ‘హలం’ కావాలి
సంక్రాంతి భోగి మంట
అరాచకీయాల్ని తగలేయ్యాలి
పచ్చని పైరుకి ‘మంచె’ను కావాలి
పాలెగాని చేలు ఆకుచుట్టును కావాలి.

***

4.

మనిషి కదలాలి
కదిలి ఎదగాలి
ఎదుగుతూ ఒదగాలి
పచ్చగ పదికాలాల పాటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here