[dropcap]ఆ[/dropcap]రోగ్యమే మహా భాగ్యము
అందరి డెందమానందము.
కల్తీ సారా, ధూమపానము
హానికర మందరికి తెలుసు.
వాడుకుంటే వాడిపోదురు
ప్రాణములకు ముప్పు వచ్చును.
తెలిసి కూడా మానకుంటే
తెలివిపై సందేహ మాయె.
ఉత్పత్తులను నిషేధించదు
ఉన్నతుల సర్కారు గూడ.
***
జర్దాపాను, గుట్కా గుటకలు
స్వర్గానికి దారులంటరు.
కాన్సరొచ్చి కౌగిలించును
ప్రాణములను పరిహరించును.
పైసలిచ్చి తద్దినము కొను
క్కునుడు మనిషికి నష్టమాయె.
తాత్కాలిక సంతోషమునకు
తగదు ప్రాణము తీసుకునుట.
తయారీలను నిషేధిస్తే
తంటాలే ఉండవయ్యా!
***
బీరు, విస్కీ, బ్రాంది మద్యము
సేవనము పెట్రేగిపోయెను.
ఉన్నవారని, లేనివారని
తేడా లేదు, తాగి ఊగిరి.
కష్ట జీవుల చెమట చుక్కల
ప్రవాహం సుడిగుండమాయె.
ఆదాయము కొరకు సర్కారు
ఆదరణ లైసెన్సులిచ్చె.
వైను షాపులు, బార్లు జూడగ
నిత్య కల్యాణముగ నుండె.