[dropcap]వృ[/dropcap]ద్ధాప్యం! వృద్ధాప్యం! వృద్ధాప్యం!
కడు కష్టం… వృద్ధాప్యం!
పెను భారం… వృద్ధాప్యం!
మాటాడ మనిషి లేడె
బాధ పంచుకునే నాథుడు కరువె
అందరూ అయినవాళ్ళె
అయినా ఒంటరి బ్రతుకె.
నాన్నా! మీకు ఫోన్
కొడుకు గొంతులో విసుగు
మావయ్యా! మీకు కాల్
కోడలి స్వరంలో విసురు…
తాతాయ్యా! మీకిన్ని ఫోన్‌లా?
మనవడి చిర చిర
అబ్బబ్బా!
మీకింతమంది నేస్తాలా?
మనవరాలి కొఱ కొఱ…
‘ఇంత బతుకు బతికి
ఇంటి వెనకాల చచ్చినట్లు’
నాడు లక్షల్లో జీతం
నేడు వేలల్లో పెన్షన్
నేస్తాలతో ఫోన్ మాట్లాడే స్వేచ్ఛ నాస్తి!
దేవుడా…!
త్వరగా కలిగించు వి(ముక్తి)!