[dropcap]గ[/dropcap]తాల గోతులు తవ్వుకుంటూ
గాయాల గాజు ముక్కలను
ఏరుకుంటూ….
హృదయాంతరాలలో రగిలే
నిఘాడ రహస్యాలను ఎగదోస్తూ
వేదనా గీతికలు ఆలపిస్తావెందుకు
తెలియని రేపటి భవిత కై
మనసు బంధాలను
మరుగున దాస్తూ….
మనీ బంధాల మరీచికల వెంట
అలుపెరుగక పయనిస్తూ
స్వార్ధపు విత్తులను జల్లుకుంటావెందుకు…..
నిన్నటిలో తలమునకలవుతూ
రేపటి ఆశల పేకమేడలు పేర్చుకుంటూ….
కళ్ళముందు కనుమరుగవుతున్న
వర్తమాన కాలాన్ని
విస్మరిస్తావెందుకు….?
కదులుతున్న క్షణాలను
మధుర క్షణాలుగా మలుచుకుంటూ జీవితాన్ని
ఆస్వాదించు మిత్రమా!