[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. పారా హుషార్! (4,2) |
4. వీరేంద్రనాథ్ నవల (4) |
7. పల్లము కానిది (2) |
8. అకౌంటు మొదట్లో కుదిస్తే ప్రమాదం (2) |
9. నాలుగు చేతుల దేముడు (7) |
11. ఇత్తడి మధ్యలో యుద్ధం. (3) |
13. ప్రభలో విశ్వంగారి శీర్షిక రెండో అక్షరం స్థానబ్రంశం చెందింది. (5) |
14. కుతితో ప్రారంభం జీవితాంతము (5) |
15. జమునది అదో లోకము (3) |
18. శ్రీరాముని పంపమని విశ్వామిత్రుడు దశరథుడిని దేనికొరకు అర్థించాడు? (7) |
19. మీకు మీరే. తమకు __? (2) |
21. కొండ గోగుతో వాలు. (2) |
22. బల్గేరియా, ఉక్రెయిన్, హంగేరి, సెర్బియా, మాల్దోవా దేశాలతో సరిహద్దును పంచుకునే దేశం. (4) |
23. నక్షత్రవీధి. (6) |
నిలువు:
1. ప్రవరుడి పెళ్ళాం. (4) |
2. సరస్వతీపుత్రుని సగం ఇంటిపేరు. (2) |
3. పత్రిక తరఫున వెలువడిన వనితా పక్షపత్రిక రెండో అక్షరం ముందుకు జరిగింది. (5) |
5. వైజాగులో చెట్టుకొమ్మ (2) |
6. కమలయ్య తాత గుణింతాలు సవరించి సరిచేసే నునులేత పత్రము.(6) |
9. వంతెన అనే కథల పుస్తకాన్ని వెలువరించిన తెలుగు రచయిత్రి. తమన్నాకు బంధువు అనుకొనేరు. కాదు. (4,3) |
10. రివైవల్(7) |
11. కణజాలం మొదట్లో కరకట్ట (3) |
12. గుర్రం మధ్యలో సాగదీస్తే కాలం (3) |
13. పాకుడురాళ్ళుకు పెట్టని పేరు. దాశరథి నవల (2,4) |
16. Excuse me (2,3) |
17. కన్నడ ప్రజల ఉదాసీనత (4) |
20. శ్రీశ్రీ,వరద,ఆరుద్రల మేక కూతలు. (2) |
21. పతంజలి నవలిక రెండో సగం ఖుర. (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 జూలై 28 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 ఆగస్టు 2 తేదీన వెలువడతాయి.
పదసంచిక-61 జవాబులు:
అడ్డం:
1.బీరకాయపీచు 2. దివ్యభామ 7. డుక్కు 8. గోద 9. పుష్పగిరి తిమ్మన 11. కముజు 13. అంతఃపురము 14. లుపూడిమ్మగు 15. రుసుము 18. ముచ్చకాయముగ్గురు 19. కరి 21. తామా 22. టివచపం 23. ముగరముపీట
నిలువు:
1.బీడుభూమి 2. రక్కు 3. చుట్టరికము 5.భాగో 6. మదపుటేనుగు 9. పుక్కిట పురాణము 10. నమ్మిచెడినవారు 11. కమురు 12. జులుము 13. అంగార శకటి 16. సునయనము 17. గాలిమాట 20. రివ 21. తాపీ
పదసంచిక-61కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- భాగవతుల కృష్ణారావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- రామలింగయ్య టి
- రంగావఝల శారద
- తాతిరాజు జగం
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.