బ్రెజిల్ నదీతీరాన మా నడక

1
3

[box type=’note’ fontsize=’16’] ప్రపంచవ్యాప్తంగా నదీతీరాలలో తమ నడకలో భాగంగా బ్రెజిల్ లోని నదీతీరాన సాగించిన తమ పర్యటన అనుభవాలను వివరిస్తున్నారు నర్మద రెడ్డి. [/box]

[dropcap]బ్[/dropcap]రెజిల్ దక్షిణ అమెరికాలోని లాటిన్ అమెరికాలో కెల్ల అతిపెద్ద దేశము. 8.5 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంతో 212 మిలియన్ల ప్రజలతో నున్న దేశము. నార్త్ వెస్ట్రన్ దిశలో వుంది. బ్రెజిల్ లోని ‘Parana’, ‘Madeira’ అనే నదులు ఈ దేశంలో అమెజాన్ నదిలో కలుస్తున్నాయి.

ఇక్కడ Rio de Janeiro లో చూడదగిన స్థలాలు ఎన్నో ఉన్నాయి. Sao Paulo ఈ దేశంలో అతి పెద్ద నగరము. దీనిని చూడాలని ఎప్పటి నుండో కోరిక. బ్రెజిల్ కార్నివాల్ కూడా. ఒక సంవత్సరం ముందే మేము Copacabana లో 3 రోజులు ఓ రిసార్టులో ఉన్నాము. మళ్ళీ రెండవసారి కూడా కార్నివాల్‌కి వెళ్ళాము. అప్పుడు 3 రోజులు దీవిలో, రెండు రోజులు Copacabana లో వున్నాము.

హైదరాబాద్ నుండి బ్రెజిల్‌కి 14,712 కి.మీ. అయితే బ్రెజిల్‌కి వెళ్ళే దారిలో పారిస్‌లో విమానం 3 గంటలు ఆగుతుంది. మేము దిగగానే ఒక ప్రక్కన ఒకతను Sao Paulo (బ్రెజిల్) అని ఒక ప్లకార్డు పట్టుకున్నాడు. ఎవరైతే Sao Paulo వెళ్తున్నారో ప్రక్కకు రండి అన్నారు. అలా మేము ఒక ప్రక్కన నిలబడగానే “మీకు ట్రాన్సిట్ వీసా వుందా?” అని అడిగారు. లేదు అన్నాము. వెంటనే ‘ఫాలో మీ’ అన్నాడు. మేము సరే అని ఆయన వెంట వెళితే అతను నేరుగా పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్ళాడు. “అదేంటి? ఇలా తీసుకొని వెళ్తారు?” అని అడిగితే “మీకు ట్రాన్సిట్ వీసా లేదు. ఇక్కడ కూర్చొండి” అన్నారు.

మేము ఓ చెంచ్ మీద కూర్చున్నాము. మేము హైదరాబాద్ నుండి బాంబే, బాంబే నుండి దుబాయి, దుబాయి నుండి పారిస్ వెళ్ళాము. రాత్రి మొత్తం నిద్రలేదు. సరే, ఒక గంట అయ్యాక “నేను టాయ్‌లెట్‌కి వెళ్ళాలి” అన్నాను. ఓకే అని టాయ్‌లెట్ చూపించారు. అక్కడే బ్రష్ చేసుకొని టాయ్‌లెట్ వెళ్ళి వచ్చి కూర్చున్నాము. మా ముందు ఒక అమ్మాయి సెల్ లోపల వుంది. నేను వెళ్ళి “ఎందుకు? ఇందులో వున్నావు?” అన్నాను. “ఏమో తెలియదు” అంది. ఒక్క క్షణం ‘బాబోయి మనల్ని కూడ ఇందులో పెడ్తారా?’ అని భయపడ్డాను. ఆ అమ్మాయి పెద్దగా పాటలు పాడ్తోంది. గట్టిగా ఏడుస్తుంది. తనను ఎందుకు పెట్టారో తనకే తెలియదు అంటోంది.

ఒక గంటకి ఆఫీసర్ వచ్చి మా పాస్‌పోర్టులు తీసుకొని to & fro టికెట్స్ తీసుకొని వెళ్ళారు. పిచ్చి ఆకలి, నిన్న మధ్యాహ్నం బయల్దేరితే ఇప్పుడు పారిస్ చేరాము. నిద్ర లేదు, తిండి లేదు. ఇంక ఇలా కాదని ఆ పోలీసుని పిలిచి “ఇంకా ఎంత సేపు వుంచుతారు?” అని అడిగాము. జవాబు లేదు. మా వారి బ్యాగ్ లో రెండు బిస్కెట్స్ వుంటే ఇద్దరం తిన్నాము. అదే బ్రేక్‌ఫాస్ట్. మమ్మల్ని ఎయిర్‌పోర్టుకు పోనివ్వలేదు. 3 గంటలు అక్కడే కూర్చోబెట్టి మధ్యాహ్నం 1 గంటకి మమ్మల్ని ఐదుగురు పోలీసులు చుట్టూ నిలబడి మా ఇద్దర్ని ఫ్లయిట్ దగ్గర గేటు వరకు తీసుకొని వెళ్ళి ఫ్లయిట్ ఎక్కించాకనే తిరిగి వచ్చారు. మా టికెట్ ఏజెంట్ మీద పట్టరాని కోపం వచ్చింది, ట్రాన్సిట్ వీసా తీసుకోవాలని తెలీదా అని?

ఫ్లయిట్ ఎక్కాక కూడ 3:30 కి food పెట్టారు. దాదాపు శివరాత్రి చేసినట్లుగా క్రితం రాత్రి తింటే ఆ తర్వాత no sleep, no rest, no coffee, మధ్యాహ్నం 3:00 గంటలకి వారి food పెట్టారు. ఆకలి, నీరసంతో అలమటించిపొయ్యాము. మళ్ళీ పారిస్ నుండి Sao Paulo మర్నాడు రాత్రికి చేరాము. దాదాపు 2 ½  రోజుల ప్రయాణం, ఇంకా వేచి ఉండే సమయం. కొన్నిసార్లు తక్కువ ధరకి ఫ్లయిట్ దొరుకుతుందని చేస్తే కూడా ఇలాగే వుంటుంది.

బ్రెజిల్‌కి అంటే.. రియోకి చేరేసరికి రాత్రి 10:30 అయ్యింది. 10:30కి మేము బుక్ చేసిన హోటల్‌కి వెళ్ళాలని ఒక టాక్సీ డ్రైవరుని పిలిచాము. ఆ టాక్సీ డ్రైవరుకి మా బాబు బుక్ చేసిన హోటల్‌కి తీసుకొని వెళ్ళమని చెప్తే, అతను అరగంటలో ఒక అడవిలోకి తీసుకొని వెళ్ళాడు. చిమ్మ చీకటి స్ట్రీట్ లైట్స్ లేవు. నేను మా వారితో “మనల్ని చంపడానికి తీసుకొని వెళ్తున్నాడు” అని ప్రతి 5 నిమిషాలకి తెలుగులో మాట్లాడున్నాను.

ఆ టాక్సీ డ్రైవరు ఒక పెద్ద పాత బంగ్లా లాంటి దాని ముందు ఆపి, “దిగండి” అన్నాడు. పెద్ద గేట్, అది లాక్ చేసివుంది. ఆ చీకటిలో మొబైల్ కాంతిలో చూపించాడు. నేను దిగేటప్పుడు మా వారితో అన్నాను “ఇంక అంతే సంగతులు. ఏమైనా డబ్బు అడిగితే ఇచ్చి చేతులెత్తి దండం పెడదాము. చంపకుండా విడిచిపెట్టమని” అని గొణిగాను.

ఆ గేట్ చూపించి “రండి, కార్ ఎక్కండి” అన్నాడు, ఎక్కాము. నేరుగా ఒక పోలీస్ స్టేషన్‌కు తీసుకొని వెళ్ళాడు. పోలీస్ స్టేషన్లో దిగమన్నాడు. అక్కడి పోలీసులతో స్పానిష్ లో ఏదో మాట్లాడి మాకు ఇంగ్లీషులో చెప్పమని అడిగాడు. ఆ పోలీసు “మేడమ్ మీరు బుక్ చేసిన హోటల్ మరమత్తులలో వుంది. మీరు మీకు తెలీకుండా ఈ హోటల్ బుక్ చేశారు. కాబట్టి, ఈ హోటల్ లేదు కనుక మరో హోటల్‌కి వెళ్ళండి. ఈ టాక్సీ డ్రైవర్‍ని మీరు నమ్మటం లేదట. ఆయన ‘నేను చాలా నిజాయితీ మనిషిని. నన్ను వీరు అనుమానిస్తున్నారు’ అని కంప్లెయింట్ ఇచ్చాడు” అన్నారు. అది విని ఆశ్చర్యపోవటం మా వంతైంది. సరే దగ్గరిలో ఒక హోటల్ పేరు చెప్పమని అడిగాము. దగ్గర్లో వున్న హోటల్‌లో దించి వెళ్ళాడు. ఆ టాక్సీ డ్రైవర్‌కి 30 డాలర్లు ఎక్కువ ఇచ్చి నమస్కరించి పంపించాము.

ఎప్పుడూ డ్రైవర్లని నమ్మము కదా. పైగా అనుమానం పెనుభూతంలా మారింది. ఇంతకీ మము మాట్లాడే భాష తెలుగులో అయినా కూడ అతనికి మా భయం, హావభావాలు అర్థం అయ్యాయి. మా మూగ భాష కూడ అర్థం అయిపోయింది.

బ్రెజిల్‌లో డ్రగ్స్ వాడకం అని చాలా భయం వేసింది. వచ్చేటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో సెల్‌లో‌ వున్న అమ్మాయి డ్రగ్స్ తీసుకుని వుందట, అందుకే జైల్లో వుంచారు. అవన్నీ గుర్తుకు వచ్చి ఆ రాత్రి చాలా భయవేసింది. కాని టాక్సీ డ్రైవరు మా ఆలోచనని తృటిలో తృంచేసాడు. నిజంగా టాక్సీ డ్రైవర్లు ఇంత నిజాయితీగా వుండం నాకు ఎతో ధైర్యాన్నిచ్చింది.

మర్నాడు మేము అక్కడ పార్కులు, నగర భవనాలు, ఇంకా అన్ని ముఖ్యమైన కట్టడాలు చూశాము. 2వ రోజు Rio-de-Janeiro వెళ్ళాము. Rio-de-Janeiro ని Rio అని పిలుస్తారు. Rio లో మేము 10 రోజులు వున్నాము. ఒకప్పుడు Rio బ్రెజిల్ రాజధాని కాని ఇప్పుడు కాదు. 1763 నుండి 1960 వరకు రాజధానిగా ఉంది.

Rio Carnival కి వెళ్ళాము. సాధారణంగా ఈ కార్నివాల్ ఫిబ్రవరిలో వుంటుంది. ఈ Carnival before lent వుంటుంది. 1723లో ఇది మొదలైంది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద కార్నివాల్, 2 మిలియన్ల మంది ఈ కార్నివాల్‌కి ప్రతి రోజు వస్తారు. దీనినే “The Biggest Show on Earth” (Portugese – O Maior show da Terra) అంటారు. 46 రోజులు వుంటుంది. Ash Wednesday రోజున ముగుస్తుంది.

ఫ్రెవో, మారకాటు అనే cultural manifestation జానపద గేయాలు వుంటాయి. వీటిని ఎక్కువగా Samba schools నిర్వహిస్తాయి. 2011 లో 4.9 మిలియన్ల సౌత్ అమెరికన్లు వస్తే విదేశీయులు 4,00,000 లక్షల మంది వచ్చారు.

మేము 2008 లో వెళ్ళాము. మరల 2014 లో వెళ్ళాము. మేము 2008 లో వెళ్ళినప్పుడు ఈ కార్నివాల్ 6 రోజులు జరుగుతుంది. మేము Sao Paulo లో రిసార్టుని ఏడాది ముందే బుక్ చేసుకున్నాము. 4 రోజులు రియోలో, 3 రోజులు Copacabana beach లో ఉండేలా రిసార్టు బుక్ చేసుకున్నాము. Sao Paulo లో దిగగానే 5 కి.మీ దూరంలో ఉన్న మా హోటల్‌కి చేరాము. 6 గంటలకి Bahia ఊరేగింపు మొదలు అవుతుందని చెప్పారు. మేము హోటల్ గది పై నుండి కిందికి చూస్తే ఊరేగింపు పెద్ద మైకులతో 2 లక్షల మంది ఒక వీధిలో వుండవచ్చు. ఇసుక వేస్తే రాలనంత జనం క్రిక్కిరిసి వున్నారు.

అలాంటి ఊరేగింపు, ఇంత మందిని నా life time లో చూడలేదు. ఒక ప్రవాహంలా గంగా నదిలాగ ఉరవళ్ళు తొక్కుతూ పై నుండి ఉబికి వచ్చినట్లు ఈ జనాలు అలా ఆ వీధుల్లో – 2, 3 గంటలు పాటు నడిచారు. తెల్లవారే వరకు ఎన్ని గంటలైనా ఆ ప్రవాహ ఉరవడి తగ్గలేదు. అన్నీ పాటలు, డాన్సులు, రక రకాల డ్రెస్సులు, రకరకాల mask లు, రకరకాల జుట్టు రంగులు, ఎన్నో వింతైన హావభావాలు, శరీరమంతా రంగులు, ఎంత వర్ణించినా తక్కువే. అయితే మొదటి రోజున మేము క్రిందకి దిగలేదు.

రెండవ రోజు ఆ జనంలో వెళ్ళడానికి షూస్ వేసుకొని, స్వెట్టర్ వేసుకొని కొద్దిగా డబ్బుతో క్రిందికి దిగి ఆ వీధుల్లో వారితో పాటు నడుస్తూ 4 గంటలు గడిపాము. రకరకాల తినుబండారాలు, పానీయాలు, రోడ్డుకి అటు సైడు, ఇటు సైడు వచ్చే చిన్న దారుల్లో తిరుగుతూ అమ్ముకున్నారు. ఆ ఊరేగింపు అన్ని లక్షల మంది వున్నా ఎక్కడా తోచుకోవటం లేదు. దొంగతనం లేదు, అందరూ ఆ సంబరాలలో మునిగి తేలుగుతున్నారు.

అంతటి ప్రవాహంలో మేము ఎక్కడ నలిగిపోతామో అనుకున్నాను. అస్సలు ఏమీ జరగలేదు. రాత్రి 9 గంటలకి బ్రెడ్ చికెన్ తినేసి 10 గంటల వరకు అన్ని మ్యూజిక్ కన్సర్టులు చూచి ఆనందిస్తూ గడిపాము.

Samba Samba Schools 70 దాకా వున్నాయి. ఈ 70 Schools, ప్రతీ ఏడాది ఒక థీమ్ తీసుకొని దాని ప్రకారం ఒక 1000 నుండి 4000 మందికి శిక్షణనిస్తాయి. ప్రతి ఒక్కరు డాన్స్ తర్ఫీదుకి ఎన్నో డాలర్లు ఇచ్చి అందులో జాయిన్ అవుతారు.

దేశం అన్ని ప్రాంతాల నుండి, ప్రపంచ దేశాల నలుమూలల నుండి ఈ డాన్స్ లో పాల్గొనడానికి మెయిల్స్ పంపి వారి సభ్యత్వం తీసుకుంటారు. వారికి ఈ డ్యాన్స్ నేర్పించి వారి డ్రెస్సులు కూడ వారే కొనాలి. ఇదంతా మాకు మేము వున్న హోటల్లో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఒక డాన్సర్ చెప్పారు. మా రిసెప్షన్‌లో కార్ గురించి మాట్లాడుతూ వుంటే కలిస్తే, అతనితో పాటు మేము ఇద్దరు 10 సీటర్ బస్‌లో రెండు గంటలు ప్రయాణం చేశాము. ఆ ప్రయాణంలో ఈ విశేషాలు చెప్పారు. 3 నెలలు డాన్స్ ప్రాక్టీస్, ఎన్నో వేలతో కొన్న డ్రెస్, వేసుకొని ఆ dance performance చేయడానికి సిద్ధమయ్యాడు. ఆయన ఎంతో సంతోషంగా “ఈ కార్నివాల్‌లో డాన్స్ చేయడానికి నేను అర్హత పొందాను” అని ఉబ్బితబ్బిబై చెప్తుంటే ఆశ్చర్యంగా చూశాము.

మొదటిసారి వెళ్ళినప్పుడు మొదటి రోజు Copacabana beach నుండి ఒక ట్రెయిన్ ఎక్కి ఒక రోజు ముందుగా ఒక స్టేడియం చూద్దామని వెళ్ళాము. 4 గంటలకి బయల్దేరాము. మాకు ట్రెయిన్లో 80 సంవత్సరాల మహిళ కలిశారు. నా ప్రక్క సీట్లో కూర్చుంది. తను అక్కడే నివసిస్తుంది. తను “నేను మంచి ప్లేస్ కి తీసుకొని వెళ్తాను. నీకు యిష్టమైతే” అన్నారు. ఓకే అన్నాను. మావారు నేను ఆవిడతో పాటు ఒక ముందు స్టేషన్ అంటే stadium కంటే ముందు స్టేషన్లో దిగమన్నారు. అలాగే అని దిగేశాము.

తను “ఒక్కొక్క బండి మీరు ఫొటోలో చూడవచ్చు. ఒక బండిని తయారు చేయడానికి ఎన్నో లక్షల తయారు చేయడానికి ఎన్నో లక్షలు ఖర్చు పెడ్తున్నారు” అని చెప్పారు. సుమారు కోటి వుండవచ్చు. అంత చక్కటి బండ్లను ఒక థీమ్‌తో తయారు చేసి వుంటారు. ఈ డాన్సర్లు అందరూ ఆ బట్టలు వేసుకొని కొంతమంది rehearsal practice చేస్తున్నారు. అలా ప్రతి బండి దగ్గర నుండి చూచే భాగ్యం కల్గింది. మేము ఆ ఒక్కొక్క బండిని చూస్తూ ఆ dancers ని పరిచయం చేసుకుంటుంటే సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు అన్ని బండ్లు చూడడానికి సరిపోయింది. ఆ రోజు 2 కి.మీ. నడిచి వుండవచ్చు, అన్ని వందల బండ్లు. ఇంక 12 కాగానే ఆ 80 సంవత్సరాలు లేడీ చకా చకా నడుస్తూ, “నేను వెళ్ళిపోవాలి, మా అమ్మకి చెప్పకుండా బయటి నుండి బయటే వచ్చేశాను, తను ఎక్కడ నాతో వస్తుందోనని” అంటూ వెళ్ళిపోయారు. 80 ఏళ్ళ ఆవిడ చక చక 30 ఏళ్ళ పడుచులా నడిచారు. ఆవిడని చూచి ఆశ్చర్యపోయ్యారు.

ఆవిడతోపాటు మళ్ళీ అదే స్టేషన్ Copacabana లో దిగి ఆమెని వాళ్ళింటి దగ్గర దించి మా RCI హోటల్‌కి వచ్చాము. మర్నాడు Copacabana beach కి వెళ్ళి రోజంతా City Tour చేసి సాయంత్రం original show కి బయల్దేరాము. ఆ రోజు మేము వెళ్ళిన వెంటనే 100 డాలర్లకి కి ఒక టికెట్ – 500 డాలర్లు విలువైన టికెట్లని 100 డాలర్లకే అమ్మారు వారు.  తిరిగి వెళ్ళి పోవాలని తొందరలో 500 డాలర్ల టికెట్ 100 డాలర్లకే దొరికిందని సంతోషంగా ఆ స్టేడియంలో అడుగుపెట్టాము.

ఇది అన్ని స్టేడియం లాగ రౌండ్‌గా వుండదు. అటు సైడ్ ఇటు సైడ్ పొడవు రోడ్డు మద్యలో అటు ఇటు కూర్చోడానికి స్థలం మెట్లు వుంటాయి. స్టేడియం లాగ లోపలికి వెళ్ళగానే 3000 వేలమంది ఒక theme లో ఒకటే రకమైన డ్రెస్‌లో ఊరేగింపు; సాంబా స్కూలు పాటలు, అమ్మాయిలు, అబ్బాయిలు స్టేడియం అంతా మార్మోగిపోతుంది. ఒక రోజు 8 లక్షల మంది అది చూడడానికి వస్తారు. 4,00,000 లక్షల విదేశీయులు, 4 లక్షల సౌత్ అమెరికన్ జనాలు అందరూ ఒకచోట చేరుతారు. ఈ event ని తయారు చేయడానికి ఒక సంవత్సర కాలం పాటు ప్రయాసపడ్డారట.

సాయంత్రం 7 గంటలకి మొదలయితే ఉదయం 6 గంటల వరకు అన్ని possessions ఊరేగింపులు జరుగుతూనే వున్నాయి. ఈ అన్నింటికి స్కూల్స్ Sambadrome dance లతో – 2 రాత్రులు ఈ షో ఉంటుంది. Special Show. 1984 లో కార్నివాల్ స్టేడియం రూపకల్పనని ‘Oscar Niemeyer’ చేశారు. 2300 అడుగులు పొడవు స్టేడియంలో 90 వేల మంది మాత్రమే పడతారు. ఈ స్టేడియంలో 10 రియల్ నుండి 5000 రియల్ వరకు టికెట్స్ అమ్ముతారు. ఇది last minute లో దొరకదు. కాని మాకు లక్కీగా దొరకాయి ఆ టికెట్స్.

90 నిమిషాలు ఒక్క ఊరేగింపు. అలా రాత్రి మొత్తం ఆ ఊరేగింపులు జరుగుతూ ఉంటాయి. ఇది పందెంతో కూడుకున్న ప్రదర్శన. ఇది గెలిచిన వారికి పారితోషికం వుంటుంది. కాని ఇన్ని లక్షల మందిని అక్కడ అదుపు చేయటం ఆశ్చర్యం.

రెండవ సారి వెళ్ళినప్పుడు కూడ ఆ డ్యాన్సర్ మాకు టికెట్స్ అమ్మాడు. 2 టికెట్స్ మా ఫ్రెండ్స్ 8 మందితో వెళ్ళాము. వాళ్ళకి టికెట్స్ దొరకలేదట. వాళ్ళు హై ప్రీమియం – ఒక్కో టికెట్టు 20,000 కి కొని వచ్చారు. మేమందరం కల్సి వెళ్ళగా Argentina చూడాలని వారు విడిపోయి వేరేగా, వేరే హోటల్‌లో దిగారు. అందువలన వాళ్ళందరి మద్య కమ్యూనికేషన్ లేదు.

మర్నాడు రియోకి దగ్గర్లో వున్న; ప్రపంచ అద్భుతాలలో ఒకటైన Christ statue చూడ్డానికి వెళ్ళాం. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాలలో ఇది ఒకటి. చిటారు కొమ్మన వున్నట్లు ఒక కొండ అంచు భాగంలో ఈ విగ్రహం వుంది. చాలా రిలాక్స్‌డ్‌గా రియోలో అన్ని ప్రదేశాలు చూచి ఒక దీవికి వెళ్ళాము.

అది Ilha Grande Island. అది రియోలో విశిష్టమైన దీవి. ఇక్కడికి చేరాలంటే Atlantic forests ని దాటాలి. అరణ్యాలు చాలా అందంగా వున్నాయి. Blue waters snorkeling చేయటానికి ఎంతో ప్రసిద్ధి. Paulo Coelho, Gabriel Garcia (1927-2014) అనే బ్రెజిల్ రచయితలు బాగా ప్రసిద్ధి చెందారు. Rio Olympics అనే పుస్తకం కూడా బాగా ప్రసిద్ధి చెందినది.

ఇవన్నీ చూస్తూ, సమయం మించిపోవడంతో మాకు ఫ్లయిట్ దొరకలేదు. మేము ఒక టాక్సీలో మళ్ళీ చాలా islands చూస్తూ Rio నుండి అమెజాన్ నదిలో ప్రయాణం చేస్తూ Amazon river rain forest cruise తీసుకున్నాము. De safio Umuserana అనే స్థలంలో Terra preta అనే కమ్యూనిటీకి వెళ్ళాము. ఇక్కడ ఎన్నో రకాల పక్షులు అన్ని చూశాము. Amazon Paradise అంటే నమ్మాలి. ఆ సూర్యాస్తమయం, అందమైన అడవులు అద్భుతం! స్థానికులు చేసిన వంటలు తిని మేము ఆ పడవలలో రెండు రోజులు ట్రిప్ తీసుకొని వెళ్ళి వచ్చాము. మాకు return flight దొరకలేదు. చాలా అష్ట కష్టాలు పడి Bus, Sharing Taxi అన్నీ ఎక్కి చివరికి ఎయిర్‌పోర్టు చేరాము. అక్కడ మా ఫ్రెండ్స్ అందరూ కలిసారు.

ఇవీ మా బ్రెజిల్ పర్యటన విశేషాలు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here