వారెవ్వా!-40

0
3

[dropcap]ని[/dropcap]రుద్యోగ సమస్యనెపుడో
నిర్మూలన చేస్తమన్నరు.
పంచవర్ష ప్రణాళికలలో
ప్రాధాన్యత ఉన్నదన్నరు.
భారతదేశములోనె యువత
సంఖ్య బాగా ఉన్నదనిరి.
“అత్తారింట్ల అన్ని వున్నా
అల్లుని నోట శని వున్న”ట్లు
చదువుకున్న నిరుద్యోగులతో
నిండియున్నది ఇక్కడేను.

***

ఆనాటి నుండి నేటి వరకు
సజీవమ్మే సమస్యాయె.
పొరుగుసేవల ఉద్యోగులను
వేసుకొనిరి, తీసివేసిరి.
“దంచినందుకు బుక్కినదె మీ
కూలి” యనుచు కూడబలికిరి.
వత్సరములో పది నెలలకు
జీతమిచ్చి దులిపివేసిరి.
ఎదుగు, బొదుగు లేని నౌకరికి
ఏమి భద్రత లేదు యనిరి.

***

ఒప్పంద ఉద్యోగమ్ములని
గొప్పలెన్నో చెప్పుకొనిరి.
ఎంతకాలము చేసినా అది
శాశ్వతము కానే కాదట.
నిరుద్యోగుల శ్రమను దోచిరి
నడిబజారున వదిలేసిరి.
అయినగాని, పూర్తి ఉద్యో
గాలు నింపరు నెనరు కరువు.
పాతికేళ్ళుగ నడుపు చుండిరి
పాలకులకిది న్యాయమేనా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here