[dropcap]క[/dropcap]ళాభారతి పుట్టుక
ఫిల్మ్ క్లబ్ కలయిక
మనో నేత్రాల్లో
కొత్త దృశ్యాలు
జీవితకాలం నడక
కాళ్ళ నెప్పులు లేవు
నా పాదాలకు
మాఊరిమట్టి
తుమ్మలవారు
గాంధీకవి మాత్రమేనా
బాపట్ల అంచులకు
కాంతిదీపం!
భావనారాయణుడు
ఆంజనేయుడు
భావపురి రధానికి
రెండు చక్రాలు
చుక్ చుక్ పుల్లలా
దాక్కున్న బాల్యాన్ని
ఈ ఇసుకలో
వెతుక్కుంటూనే ఉన్నాను
నవంబర్ డెభై ఏడు
తెల్లరటంలేదు
ఎందరినో తెల్లార్చిన
తుఫాన్ రాత్రి!
రధోత్సవంలో
అంతా పెద్దలే
పెద్ద పండగ
స్వాహా స్వాములకూ
మా ఇంటిడాబా
నా కలలమేడ
అమ్మ నాన్నల్లా
అన్నీ కాలగర్భంలోకి