గోడ…

1
3

[dropcap]నీ[/dropcap]కూ-వారికీ మధ్య….
మీకూ-మనకూ మధ్య….
బతుకుకు-మెతుకుకూ మధ్య….
పేదోడికీ-పెద్దోడికీ మధ్య….
పేరుకూ-పరువుకూ మధ్య….
బంధాలకూ-పంతాలకూ మధ్య….
మోహానికీ-ద్రోహానికీ మధ్య….
భాషకూ-భావానికీ మధ్య….
భావానికీ-భారానికీ మధ్య….
కధకూ-కదనానికీ మధ్య….
దేహానికీ-దోషానికీ మధ్య….
దేశానికీ-ద్రోహానికీ మధ్య….
స్వేదానికీ-వేదానికీ మధ్య….
పదాలకూ-పధాలకూ మధ్య….
దండాలకు-కోదండాలకూ మధ్య….
హోదాలకూ-సోదాలకూ మధ్య….
జరాలకీ-నవ తరాలకీ మధ్య….
జలాలకూ-జీవాలకూ మధ్య….
నోరుకు-పోరుకు మధ్య….
గమ్యానికి-గమనానికి మధ్య….
గమనానికీ- దమనానికీ మధ్య….
సామ్యానికీ-సైన్యానికీ మధ్య….
రాజ్యాలకు-భాజ్యాలకు మధ్య….
సాధ్యాలకు-చోద్యాలకు మధ్య….
లాస్యానికీ-దాస్యానికి మధ్య….
మౌనానికి-మౌఢ్యానికీ మధ్య….
వీరానికీ-బేరానికీ మధ్య….
విప్లవానికి-నిగ్రహానికీ మధ్య….
నిజానికీ-ఇజానికీ మధ్య….
కలకూ-మెలకువకూ మధ్య….
శిల్పానికీ-శిధిలానికీ మధ్య….
కాలానికీ-జాలానికీ మధ్య….
ప్రమోదాలకు-ప్రమాదాలకు మధ్య….
ప్రవాసాలకు-ప్రభాసాలకు మధ్య….

గోడలెన్నో గోడులెన్నో
గోడులెన్నో మోడులెన్నో
మోడులెన్నో ఓడులెన్నో
ఓడులెన్నో జోడులెన్నో

గోడలన్నీ కరిగినా తరిగినా….
గోడలన్నీ జరిగినా ఒరిగినా….
మారునా మనిషి మాట!!
మారునా మనిషి బాట!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here