[dropcap]వా[/dropcap]రి ప్రేమకు లేవు దూరాలు
రాధ మనసులో కృష్ణుడు
కృష్ణుడి మనసులో రాధ
తలచుకోగానే ఒకరి
సమీపంలో ఒకరు
ఆత్మ ప్రేమికులు వారు
దేహ ప్రేమికులు కారు వారు
దేహ ప్రేమికులు కావచ్చు భగ్న ప్రేమికులు
ఆత్మప్రేమికులు
అభగ్నప్రేమికులు
రాధాకృష్ణులు
నిజమైన ప్రేమికులకు
ఆరాధ్య దైవాలు