సమాది

5
4

“గురువు గారు గురువు గారు సమాది అంటే ఏమి గురువుగారు” అడిగింది
తడువు

“యోగాలో యమ, నియమ, ఆసన, ప్రాణాయాన, ప్రత్యహార
ధారణ, ధ్యాన, సమాధి అని ఎనిమిది అంగాలు వుండాయి పా.
నువ్వు అడిగిన సమాది దీంట్లో కడ అంగము పా” అనిరి.

“దండాలు గురువుగారు దండాలు”

…….

“సాములు, సాములు దండాలు సాములు సమాది అంటే ఏమి
సాములు” అని అడిగితిని.

“అది నిద్రలా వుండే స్థితిపా” అనిరి.

“దండాలు సామి…. దండాలు”

…….

“తాత తాత సమాది అంటే ఏమి తాత” అంట్నీ.

“అడ్డములా 3 అడీలు పొడవుల 6 అడీలుపా” అనె.

“అంటే తాత” అని అనుమానము పడితిని.

“మనిషి సచ్చినంక పూడ్చి పెట్టే గుంతపా” నా అనుమానము తీర్సే.

“ఓ సమాది అంటే ఇదా తాత” తల గుంకాయిస్తిని.

“ఊపా” అని తల నీవి పాయ తాత.

***

సమాది = శవాలని పాతిపెట్టే చోటు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here