[dropcap]ప్ర[/dropcap]థమ దేవతవు నీవు స్వామి గణేశా
మొదటి పూజలు నీకే దేవ విఘ్నేశా
అనాది అందుకుంటున్న దైవము నీవు
పందిళ్ళు వేసి అగ్ర పీఠము వేసి
అర్చించాము నిన్ను ప్రతి సంవత్సరము
కరకు కరోనా వచ్చి కాటు వేసింది
దైవ పూజ కూడ దూరంగా చెయ్యమంది
భోజనప్రియుడవు నీవు స్వామి గణేశా
ఉండ్రాళ్ళు పాయసాలు ఫలహారాలు
ప్రతి ఏడు పెట్టాము నీకు ప్రేమతో స్వామి
ఈ ఏడు మా రేడుకి ఉపవాసమేనా
కరుణించి కరోనాను పారద్రోలు తండ్రీ
మరు ఏడు నీ బొజ్జ నింపేమయా స్వామీ
అలుగక మా పూజలు మనసులో అందుకో…