[dropcap]‘ప[/dropcap]దసంచిక’కి స్వాగతం.
సంచికలో గళ్ళ నుడికట్టు శీర్షిక కావాలనే చదువరుల కోరిక మేరకు కోడీహళ్ళి మురళీమోహన్ గారు ‘పదసంచిక’ అనే పద ప్రహేళిక నిర్వహిస్తున్నారు.
ఆధారాలు:
అడ్డం:
1. నాటకకర్త కాళిదాసుపై నాటకం వ్రాసిన నాటకకర్త (2,4) |
4. పదకొండో తిథి (4) |
7. ఉద్రిక్తతలో ఉన్నత పీఠం (2) |
8. కొంచెము, లిమిట్ (2) |
9. ఇది పట్టుకోవడమంటే అవకాశవాదమే. (1,3,3) |
11. పాండవు లెంతమంది? (3) |
13. చలువరాయి (5) |
14. దీపావళి స్పెషల్ (5) |
15. గుడిసె (3) |
18. 1-2 ఆకాశం, 2-3 బూడిద, 3-4 కొప్పు, 4-5 రూమే, 5-6 ప.గో.జిల్లా గ్రామం, 6-7 రమణకుమారుడు వెరసి శివయ్య (7) |
19. అష్టాదశశక్తి పీఠాలలో ఉన్న జంతువు (2) |
21. సతతము వ్యాపించినది (2) |
22. తరంగాలు మూలాక్షరాలతో విసుర్రాయి (4) |
23. సహస్రారానికీ, ఆజ్ఞాచక్రానికీ మధ్యలో ఉండేది (6) |
నిలువు:
1. కిట్టయ్య చేతిలోని వాద్యము (4) |
2. విడువబడిన ముత్యము (2) |
3. కారు ఉన్న విశ్వకర్మ (5) |
5. ఫాదరులో తడవతడవకూ ఒక మారే చూడు (2) |
6. హెల్మెట్లు(6) |
9. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. (4,3) |
10. ఏది నిజం సినిమాలో జిక్కి తన బావకు కోరి వండిపెట్టినది.(2,3,2) |
11. ఏ కారణం చేతనో (3) |
12. రూఢము (3) |
13. ఒకటి తక్కువ ఇరవై (6) |
16. దాల్చిన చెక్క శీర్షాసనం వేసింది. (5) |
17. కాంత ఉన్నా రహస్యమే (4) |
20. బాధ, బాణం (2) |
21. మజ్జిగ (2) |
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2020 సెప్టెంబరు 01 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు, కొత్త ప్రహేళితో బాటుగా 2020 సెప్టెంబరు 06 తేదీన వెలువడతాయి.
పదసంచిక-66 జవాబులు:
అడ్డం:
1.గగన కుసుమం 4. అరుంధతి 7. జిన్ను 8. గమి 9. ప్రతిజ్ఞాపాలనము 11. సరయు 13. కుటుంబరావు 14. గదాధరుడు 15. రుతము 18. తిరుమలాచార్యుడు 19. భవి 21. కంచి 22. వంగపండు 23. ముఖవిలుంఠిక
నిలువు:
1.గజిబిజి 2. గన్ను3.మందుపాతర 5. ధగ 6. తిమిరరిపుడు 9. ప్రథమ బహుమతి 10. మురళీధరగౌడు 11. సవురు 12.యుగము 13. కుమారసంభవం 16. తగులాయము 17. మరీచిక 20. విగ 21. కంఠి
పదసంచిక-66కి సరైన సమాధానాలు పంపిన వారు:
- అనురాధ సాయి జొన్నలగడ్డ
- ఈమని రమామణి
- భమిడిపాటి సూర్యలక్ష్మి
- భాగవతుల కృష్ణారావు
- ఇంకొల్లు బ్రహ్మేంద్రస్వామి
- సిహెచ్.వి.బృందావనరావు
- చెళ్ళపిళ్ళ రామమూర్తి
- కన్యాకుమారి బయన
- జానకీ సుభద్ర పెయ్యేటి
- తల్లాప్రగడ మధుసూదనరావు
- పద్మశ్రీ చుండూరి
- పడమట సుబ్బలక్ష్మి
- పాటిబళ్ళ శేషగిరిరావు
- పొన్నాడ సరస్వతి
- పి.వి.ఎన్.కృష్ణశర్మ
- రంగావఝల శారద
- రామలింగయ్య టి
- సీతామహాలక్ష్మి పెయ్యేటి
- శంభర వెంకట రామ జోగారావు
- శిష్ట్లా అనిత
- శ్రీ వాణి హరిణ్మయి సోమయాజుల
- శ్రీ విద్య మనస్విని సోమయాజుల
- తాతిరాజు జగం
- డాక్టర్ వరలక్ష్మి హరవే
- వర్ధని మాదిరాజు
- వాణి మొక్కరాల
- వైదేహి అక్కపెద్ది
వీరికి అభినందనలు.