సరిగ పదమని-3

0
3

[dropcap]’స[/dropcap]రిగ పదమని’ (మన రెక్కలు) అనే శీర్షికతో సంచిక పాఠకులకు రెక్కలని అందిస్తున్నారు పురాణం శ్రీనివాస శాస్త్రి.

లంచాతురాణాం
న సిగ్గు… న ఎగ్గు…
వోటాతురాణం
న మగ… న ఆడ

మందాతురాణం
న విస్కీ… న రమ్ము!

***

చ్చపచ్చని దారుల్లో
ఆశల తావులో
నీతుల సంతలో
నిత్యం పల్టీ

కలల కనులపై
కల్లోలం మనిషి!

***

లానా మతం కావాలని
అడిగి పుట్టలేదు…
నన్నే కనాలని
అమ్మ అనుకోలేదు…

యాదృచ్ఛికాలపై
రగడ జగడాలా?

***

క్కెర… బెల్లం
దేని తీపి దానిదే!
మిరియం… కారం
దేని ఘాటు దానిదే!

వింత రుచుల
కంత నోరు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here