“మన సమాజముల మంచి చెడ్డ వుంది కదనా?”
“ఊరా”
“కొండంత పాపం బండంత పుణ్యం కూడా వుంది కదనా?”
“అవునురా”
“నీ అంత నిజము నా అంత అబద్దము వుంది కదనా?”
“దానికేం బాగ్యం వుందిరా”
“లెక్కకి తగిలిండే బుద్ధి…. మిగిలిండే గుగ్గుతనము (మూర్ఖత్వము) వుంది కదనా”
“లెక్కలేనంతగా వుందిరా”
“కష్టాలు, సుకాలునా”
“కొతల వేయలేనంతగా వుండాయిరా”
“అబ్బబా ఇన్నిని లోపాలు, తాపాలు, కష్టనష్టాలు వుండే జగములా మన బతుకుబండి అదెట్ల నడస్తావుందినా?”
“ఆశ నింకారా”
“ఆశ నింకనా”
“అవునురా అక్షరాలా ఆశ నింకానే”
***
ఆశ నింకా = ఆశ వల్ల